Tuesday, November 20, 2007

బాక్స్ ఆఫీస్ రిపోర్ట్: తగ్గిన కలెక్షన్లు

1.తగ్గిన "హ్యాపీడేస్" హవాశేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మక చిత్రం "హ్యాపీడేస్" హవా కొంత తగ్గింది. అయినా ఇప్పటికీ ఈ చిత్రం మొదటి స్థానంలోనే కొనసాగుతోంది.ఎ సెంటర్లలో కలెక్షన్లు తగ్గగా, బి సెంటేలలో బాగా క్షీణించాయి.అయినా ఇప్పటికీ ఈ చిత్రం ఆరోగ్యకర స్థాయిలోనే కొనసాగుతోంది.
2.సాధారణ కలెక్షన్లతో "నవవసంతం"
ఈ వారం తరున్ చిత్రం "నవవసంతం" కలెక్షన్లు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి.అయితే "హ్యాపీడేస్" తరువాత ఎక్కువశాతం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
3.ఫన్నీ కామెడీతో మూడవ స్థానంలో నిలుచున్న"సీమ శాస్త్రి"
"సీమ శాస్త్రి" చిత్రం అల్లరి నరేశ్ కు బాగా ఊరట నిచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో నరేశ్ నటించిన ఏ చిత్రమూ కనీసం సాధారణ స్థాయిలో కూడా ఆడకపోవడంతో అతను బాగా నీరసించాడు. అయితే ఈ చిత్రంలోని రాయలసీమ నేపద్యంలో కామెడీని ప్రేక్షకులు బాగా ఆదరించడతో ఈ చిత్ర వసూళ్ళు ఆశించిన స్థాయిలోనే కొనసాగుతున్నాయి.బి,సి సెంటర్లలో ఈ చిత్రం కలెక్షన్లు బాగున్నాయి.
4.బాగా నిరాశ పరుస్తున్న"అతిధి"
మహేశ్ బాబు ప్రతిష్టాత్మకంగా భావించిన "అతిధి" చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది.ఈ చిత్రం కలెక్షన్లు బాగా తగ్గుముఖం పట్టాయి.కొన్ని సెంటర్లలో ముప్పై శాతం పబ్లిక్ కూడా లేకపోవడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
5.బి,సి సెంటర్లే "తులసి" జీవాధారం

వెంకటేశ్, నయనతారల "తులసి" కలెక్షన్లు మినిమం స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎ సెంటర్లలో బాగ తగ్గిన కలెక్షన్లు బి, సి సెంటర్లలో నిలకడగా ఉండటం వల్ల ఈ చిత్రం ఫరవాలేదనే స్థాయిలో కొనసాగుతోంది.

శ్రీవెంకట్ బులెమోని

No comments: