Wednesday, November 7, 2007

"అతిధి" విజయంకోసం మహేశ్ బాబు ప్రపంచ యాత్ర


టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు "అతిధి" చిత్ర విజయంకోసం ప్రపంచయాత్ర చేయనున్నాడు. మాస్టర్ మహేశ్ బాబు (మహేశ్ బాబు తనయుడు), తన భార్య నమ్రత సహా ముఖ్యమైన టెక్నీషియన్లతో వెళ్ళనున్న ఈ అధికారిక పర్యటన ఖర్చులను మొత్తం యు టి వి భరించనుంది. ప్రపంచంలోని "అతిధి" చిత్రం కొనసాగుతున్న అన్ని ప్రాంతాలలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిసింది. అధికారికంగా పర్యటన షెడ్యూలు ఇంకా ఖరారు కాకున్నా, నమ్రత ఇప్పటికే పెట్టేబుట్టా సర్దుకోవడం పూర్తి చేసిందని, తాము హైదరాబాదులో లని రోజులలో ఇంటికి సంబంధించి, ఆఫీసుకు సంబంధించి ఏఏ కార్యక్రమాలు చేయాలో, ఎవరికి రిపొర్ట్ ఇవ్వాలో తదితర అన్ని భాద్యతలూ అప్పజెప్పడం పూర్తి చేసిందని సమాచారం.అంటే అనధికారికంగా ఈ పర్యటన ఖరారయినట్లే కదా...!

No comments: