Monday, November 19, 2007

"సీమ శాస్త్రి" వెరీ గుడ్డు : ఆడియెన్స్ టాక్

రాయల సీమ ఫ్యాక్షనిజం నేపద్యంలో తాజాగా విడుదలైన "సీమశాస్త్రి" సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకర్శిస్తోంది. ఫ్యాక్షన్ నేపధ్యాన్ని, కితకితలు పెట్టడానికి సరైన పద్దతిలోనే దర్శకుడు వినియోగించుకున్నాడనీ, టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా పూర్తిగా కామెడీ ట్రాక్ మీదే సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని స్థానిక పత్రికల కథనం. సుబ్రమణ్య శాస్త్రి (అల్లరి నరేష్), సురేఖా రెడ్డి(ఫర్జానా) ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డప్పుడు సురేఖా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలియదు. ప్రేమ ముదిరిన తరువాత సుబ్రమణ్య శాస్త్రికి తెలుస్తుంది సురేఖా రెడ్డి ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని. శాస్త్రి గారు కూడా ఫ్యాక్షన్ తరహాలోనే వెళ్లి సురేఖా రెడ్డి తల్లి దండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఏమైందన్నది సీమశాస్త్రిని అడిగితెలుసుకోండి కానీ ఆయన చేసే ప్రయత్నాలు మాత్రం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.హీరో హీరోయిన్ లిద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అల్లరిగా నటించే నరేష్ బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో చక్కగా నటించాడు. హీరోయిన్ అందంగా కనిపించింది. పాటలు బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కామెడీ చిత్రంగా చెప్పవచ్చు. కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు వెంటనే సినిమాకు వెళ్లవచ్చు.

నటీనటులు: అల్లరి నరేష్, ఫర్జానా, జయప్రకాష్ రెడ్డి, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్, ముమైత్ ఖాన్, కోవై సరళ, రఘుబాబు తదితరులు.

టెక్నీషియన్లు:మాటలు-మరుధూరి రాజా,సంగీతం-వందేమాతరం శ్రీనివాస్,సినిమాటోగ్రాఫర్-అరుణ్,ఎడిటింగ్-రామ్ గోపాల్ రెడ్డి,నిర్మాత-చావలి రామాంజనేయులు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం-జి నాగేశ్వర్ రెడ్డి.

No comments: