Saturday, November 17, 2007

150 కోట్ల రూపాయలతో మొదలైన సంక్రాంతి సమరం

తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సమరం మొదలైంది. సుమారు నూటయాభై కోట్ల రూపాయలను ఈ సంక్రాంతి పందెంలో పట్టడానికి తెలుగు సినీ పరిశ్రమ తయారయ్యింది.పెద్ద చిత్రాల దర్శక,నిర్మాతలు తమ చిత్రాలపై ఉన్న అపార నమ్మకంతో ఈ సంక్రాంతి పందేనికి సై అంటున్నారు. ఈ సంక్రాంతి పందెంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాగార్జున, విష్ణు, అల్లు అర్జున్, ఎం ఎస్ రాజులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమవుతున్నారు. దాంతో సంక్రాంతి పర్వదినోత్సవం సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలుగు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుని ముందు మోకరిళ్ళనుంది. మరి చివరికి ఈ సంక్రాంతి సమరంలో సగటు ప్రేక్షకుడు ఎవరిని అందలంపై కూర్చో బెడతాడో, మరెవరిని పాతాళానికి తొక్కేస్తాడో వేచిచూస్తేగానీ తెలీదు. సో సంక్రాంతి సమరంలో ఉన్న చిత్రాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
1. సెంటిమెంటుపై నమ్మకంతో ఉన్న "ఒక్క మగాడు"
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న బొమ్మరిల్లు ప్రొడక్షన్స్ వారి "ఒక్క మగాడు" చిత్రం పూర్తిగా సెంటిమెంటు ఆధారంగా సంక్రాంతికి విడుదలవుతోంది. చిత్రంలో తమండ్రీ, కొడుకుల పాత్రలు పోశిస్తున్న బాలకృష్ణ కథా పరంగా సెంటిమెంటు బాగా పండిందని భావిస్తున్నాడు. మరోవైపు సంక్రాతి సమరంలో గత "సమర సిం హా రెడ్డి", "నరసిం హనాయుడు"చిత్రాలలాగా ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడు. మరోవైపు చిత్ర దర్శక,నిర్మాత వై వి యస్ చౌదరి కూడా అదే నమ్మకంతో ముందుకుకదులుతున్నాడు.
2. కుర్రకారుపై నమ్మకంతో పవన్ కళ్యాణ్ "జల్సా"యువతరం పై ఉన్న నమ్మకంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన "జల్సా" చిత్రాన్ని సంక్రాంతికి విడుదలచేయడానికి ఒప్పుకున్నాడని టాలీవుడ్ కథనం. హాలీవుడ్ "లవ్ డాక్టర్" మూల కథగా రూపొముతున్న ఈ చిత్రంలో ఇలియానా తన అందాలను ఆరబోయబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం గత "ఖుషీ" రోజులను తిరిగితీసుకువస్తుందని పవన్ నమ్ముతున్నారు.
3.యువతరం ప్రేమ, భావోద్వేగాల కలయికలో వస్తున్న అల్లు అర్జున్
బొమ్మరిల్లు భాస్కర్, దిల్ రాజుల కలయికలో అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం ఈ సంక్రాంతికి పోటీలోకి దిగుతోంది. దిల్ రజు బ్యానరుపై గతంలో అల్లు అర్జున్ చేసిన "ఆర్య", భాస్కర్ చేసిన "బొమ్మరిల్లు" చిత్రాలౌ అఖండ విజయాన్ని సాధించడంతో, వీరి కొత్త చిత్రం ఈ సంక్రాంతికి భారీ అంచనాలమధ్యన బరిలోకి దిగుతోంది.
4. దేవుడే రక్షిస్తాడన్న నమ్మకంతో వస్తున్న "కృష్ణార్జునులు"
అక్కినేని నాగార్జున, మంచు విష్ణు వర్ధన్ దేవుడూ, భక్తుడుగా నటిస్తున్న అధునిక చిత్రం సంక్రాంతి సమరంలో జవరి 14వ తేదీన విడుదలవుతోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రం "బ్రూస్ ఆల్మైటీ" ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రలో నాగార్జునది మాడ్రన్ దేవుని పాత్ర కాగా, విష్ణుది కామెడీ తరహాలో కొనసాగే పాత్ర. అన్నట్లు ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా మరో దేవునిగా ప్రత్యక్షం కానున్నారు.
5.ఎం ఎస్ రాజు ఆశలన్నీ "వాన"పైనే.

ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న "వాన" చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకమొతె ఉన్నారు. కన్నడంలో అఖండ విజయం సాధించిన "ముంగారు మాలై"(తొలకరి జల్లులు) చిత్రాన్ని ఆయన రీమేక్ చేస్తున్నారు. వినయ్ చోప్ర, మీరా చొప్రా లు ఈ చిత్రంలో నాయికా నాయకులుగా నటిస్తున్నారు.

శ్రీవెంకట్ బులెమోని

No comments: