Friday, November 16, 2007

అమెరికాలో "జై హనుమాన్ రిటర్న్స్" కు డబ్బింగ్ చెబుతున్న చిరంజీవి


"జై హనుమాన్ రిటర్న్స్" యానిమేషన్ చిత్రానికి మెగా స్టార్ చిరంజీవి డబ్బింగ్ చెబుతున్నారు.గతంలో వచ్చిన "జై హనుమాన్" చిత్రం తొలి భాగానికి కూడా చిరంజీవి డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా మొదటి భాగానికి కొనసాగింపుగా వస్తున్న ఈ "జై హనుమాన్ రిటర్న్స్" రెండవ భాగానికి కూడా చిరంజీవి డబ్బింగ్ చెబుతున్నట్లు అమెరికానుంచి వార్తలు వస్తున్నాయి. 2-డి యానిమేషన్ ప్రక్రియలో రూపొందించిన ఈ "జై హనుమాన్ రిటర్న్స్" కథ రామాయణం నుంచి తీసుకోకుండా, ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా కొత్త కథతో రూపొందించినట్లు తెలిసింది. అంటే మాడ్రన్ కథతో రూపొందించిన కొత్త కథ అన్నమాట. తెలిసిన వివరాల ప్రకారం ఈ కొత్త హనుమాన్ భూలోకానికి శతృవులైన అంతరిక్ష గ్రహ వాసులకు బుద్దిచెప్పనున్నట్లు తెలిసింది. అంటే ఇక ముందు హనుమాన్ రామాయణానికి మాత్రమే సంబంధించిన పాత్ర మాత్రమే కాకుండా, కాల్పనిక పాత్రగా కూడా రూపొందుతుందేమోనని పలువురి అనుమానం.అన్నట్లు ఈ "జై హనుమాన్ రిటర్న్స్" చిత్రం ఈ డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయమేమిటంటే ఈ చిత్రం తెలుగుతోబాటు ఇంగ్లీషు, తమిళం, హిందీ, భోజ్పురి భాషలలో విడుదలకానుంది.

No comments: