అతి అరుదైన ఈ వీడియో ప్రపంచపు తొలి టాకీ(మాటల) చిత్రం "జాజ్ సింగర్" లొనిది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రంలో 72 పాటలు ఉండటం గమనార్హం. 1927లో నిర్మించిన ఈ చిత్రంలో ఆల్ జాన్సన్, పాల్ డ్రెస్సర్స్ ముఖ్య తారాగణంగా నటించారు. మొట్ట మొదటి సారి చిత్రంలో నెగిటివ్ పై సౌండ్ ట్రాక్ ముద్రించి విడుదలచేయన్నున్న ఈ చిత్రంలో ముందుగా ఎలాంటి మాటలను ఉంచకూడదని అనుకున్నారు. కేవలం కొన్ని పెద్ద పాటలతోబాటు చిన్న చరణాలు ఉన్న సుమారు అరవై ఐదు పాటలను, కొంత సంగీతాన్ని మాత్రం ఈ చిత్రంలో ఉంచాలనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో ఈ చిత్రంలోని ముఖ్య నటుడైన ఆల్ జాల్సన్ తన పాట పాడాక, అకస్మాత్తుగా "హే వెయిట్, వెయిటె మినిట్, యూ హెవెంట్ హియర్డ్ నథింగ్ యట్!...వెయిటె మినిట్, ఐ టెల్ యూ.. యూ హెవెంట్ హియర్డ్ డర్టీ హ్యాండ్స్,..డర్టీ ఫేస్" అంటూ అర్థం, పర్థం లేకుండా మాట్లాడాడు. ఆల్ జాల్సన్ అలా అర్థం పర్థ లేకుండా మాట్లాడటమేమిటాని చిత్ర దర్శకుడు అలాన్ క్రాస్ లాండ్ చిర్రుబుర్రు లాడుటుంటే, చిత్ర సహ నిర్మాత మాత్రం "థట్ వర్డ్స్ ఆర్ ఇంప్రెస్ పబ్లిక్" అంటూ పట్టుబట్టి మరీ వాటిని చిత్రంలో అలాగే ఉంచి, చిత్రాన్ని విడుదలచేయించారు. చిత్రం విడుదల అనంతరం అందులోని పాటలు, మాటలు ప్రేక్షకూలను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.
శ్రీవెంకట్ బులెమోని
శ్రీవెంకట్ బులెమోని
No comments:
Post a Comment