Saturday, November 3, 2007

హాలీవుడ్ రచయితల స్ట్రైక్


హాలీవుడ్ సినిమా, టెలివిజన్ రచయితలు సమ్మెకు దిగనున్నారు. 1988తర్వాత మొదటిసారిగా స్ట్రైక్ కు దిగనున్న రచయితలు టెలివిజన్ సంస్థలు, సినీ నిర్మాణ సంస్థలు రచయితలకు తగిన గుర్తింపును, ఆర్థిక స్వావలంబనను కలిగించలేక పోతున్నాయని పేర్కొంటూ ఒక్క సారిగా సమ్మె కు అమెరికా టెలివిజన్, సినిమా రచయితల సంఘం (రైటర్స్‌ గిల్డ్‌) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యంగా కార్పోరేట్ కంపెనీలైన "జనరల్ ఎలెక్ట్రిక్" మరియు రూఫర్డ్ మర్డాక్ కు చెందిన "న్యూస్ కార్పోరేషన్" ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొంటూ సినిమా రచయితల మద్దతుతో వీరు సమ్మెకు పిలుపునిచ్చారు. త్వరలోనే రచయితల సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని రచయితల తరుపువారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు పాట్రిక్‌ వెర్రోన్‌ తెలిపారు. అయితే సమ్మె చేపట్టే తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఆయన వెల్లడించారు. ఈ గిల్డ్‌లో 12,000 మంది రచయితలకు సభ్యత్వం ఉంది.

No comments: