బాలీవుడ్ సినీ నటి మోనికాబేడీకి మరో ఉపశమనం లభించింది. ఆమె ముఖానికి మళ్లీ రంగులు వేసుకోనుంది.మోనికాబేడీ సినిమాల్లో నటించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. అయితఎ షూటింగ్‌ల నిమిత్తం తన సొంత స్వగ్రామం వదిలి వెళ్లేముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలనే షరతు విధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ప్రధమ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోనికాబేడీకి గతంలో షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సినీ ఆవకాశాలు వస్తున్నాయని, వాటిలో నటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మోనిక సినిమాలలో నటించేందుకు పచ్చజెండా ఊపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment