బాలీవుడ్ సెన్సేషనల్ నటీమణి దీపికా పదుకోనే క్రికెటర్లకు ప్రేమ పాఠాలు నేర్పుతోంది. భారత వన్ డే జట్టు కేప్టెన్ ధోనీ, వైస్ కేప్టెన్ యువరాజ్ సింగ్ లకు ఒకేసారి ప్రేమ పాఠాలు బోధిస్తూ అటు బాలీవుడ్, ఇటు క్రికెటర్లనూ ఆలోచనల్లో ముంచెత్తుతోంది. జార్ఖండ్ డైనమైట్ ధోనీ దీపికా పదుకోనేతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న విషయం ఇప్పుడు దాదాపు అందరికీ బహిర్గతమే. ఇటీవల ఆస్టేలియాతో ఝరిగిన 20 ట్వెంటీ కప్ కు ధోనీ ప్రత్యేకంగా దీపికాను ఆహ్వానించడతో ఆ విషయం తేటతెల్లమైంది. అయితే ఏక కాలంలో యువరాజ్ తో కూడా ప్రేమ పాఠాలు ఒలకబోస్తూ మీడియాకు చిక్కిందీ చిన్నది. అసలు విషయం ఏమిటంటే గతరెండురోజుల క్రితం దీపికా పదుకొనే, యువరాజ్లు ఇద్దరూ కలిసి గ్రాండ్ హ్యాట్ లోని చైనా హౌజ్ లో అర్దరాత్రి దాటిన తరువాత బయటకు వస్తూ మీడియా కంట బడ్డారు. కేవలం వీరిద్దరే సుమారు రెండుగంటలకు పైగా ఏకాంతంగా గడిపిన తరువాత గ్రాండ్ హ్యాట్ లోంచి బయటపడ్డ వీరు ఒకే కారులో ఎటో వెళ్ళిపోయారని ముంబై మీడియా కథనం. క్యాజువల్ డ్రెస్ లో యూవీ, క్రీం కలర్ చికెన్ వర్క్ లో దీపికా అప్పుడు బహు చూడముచ్చటగా ఉన్నట్లు తెలియజేశారు. అన్నట్లు గత కొంత కాలం క్రితం దాకా కిం శర్మ తో డేటింగ్ చేసిన యువరాజ్, నిఖిల్ పాండ్య తో డేటింగ్ చేసిన దీపికాల ఈ కొత్త సంబంధం ఏమిటాని బాలీవుడ్, క్రికెట్ వుడ్డూలు జుట్లు పీక్కుంటుంటే మధ్యలో జార్ఖండ్ డైనమైట్ ధోనీ పరిస్తితి ఏమిటాని కొత్త సందేహాలు బయలుదేరినట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment