విడుదలకు ముందే బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం "ఒక్క మగాడు" రికార్డు సృష్టిస్తోంది. గతంలో మరే చిత్రమూ చేయనంత బిజినెస్ కేవలం డిష్ట్రిబ్యూషన్ హక్కులకోసం చేసి తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలకు తెరలేపింది. బాలకృష్ణ నటించిన గత చిత్రం "మహారథి" కేవలం పదికోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూషన్ హక్కులకుగాను సాధించగా, ఈ చిత్రం ఏకంగా 25కోట్లు సాధించి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సంక్రాతికి విడుదలవనున్న అన్ని చిత్రాల్లోకీ ఈ చిత్రమే అత్యధిక మొత్తంలో అమ్ముడుపోవడం కూడా అందరినీ ఆష్చర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్ర వ్యాపారం చూస్తుంటే గతంలో "నరసిమ్హనాయుడు" సృస్టించిన రికార్డులను తిరగరాసేలా వుందని పరిశ్రమ టాక్. మరి ఈ చిత్రం విడుదలై మరెన్ని రికార్డులు సృస్టిస్తుందో వేచిచూద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment