Wednesday, October 31, 2007
శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ గౌరవం

ప్రముఖ్ సినిమా రూపకర్త శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. టర్కీలోని అంటాల్యాలో ఆదివారం ప్రారంభమైన మూడవ అంతర్జాతీయ యూరాసియా చలనచిత్రోత్సవంలో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన "ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్" చిత్రం
ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమయ్యింది. ఆ విధంగా సినిమా రంగానికి శేఖర్ కపూర్ అందించిన సేవలకు ప్రత్యేక గౌరవాన్ని చిత్రోత్సవం అందించింది. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ ప్రసంగిస్తూ టర్కీ దేశం ఐరోపా, ఆసియా ఖండాల మధ్య సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నదని అన్నారు. తద్వారా ప్రాచ్య దేశాల స్థానానికి చేరుకునేందుకు టర్కీ భౌగోళిక పరిస్థితులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. "మౌసమ్", "మిస్టర్ ఇండియా" మరియు "బాండీట్
క్వీన్" హిందీ చిత్రాల ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని శేఖర్ కపూర్ సంపాదించుకున్నారు.
ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమయ్యింది. ఆ విధంగా సినిమా రంగానికి శేఖర్ కపూర్ అందించిన సేవలకు ప్రత్యేక గౌరవాన్ని చిత్రోత్సవం అందించింది. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ ప్రసంగిస్తూ టర్కీ దేశం ఐరోపా, ఆసియా ఖండాల మధ్య సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నదని అన్నారు. తద్వారా ప్రాచ్య దేశాల స్థానానికి చేరుకునేందుకు టర్కీ భౌగోళిక పరిస్థితులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. "మౌసమ్", "మిస్టర్ ఇండియా" మరియు "బాండీట్
క్వీన్" హిందీ చిత్రాల ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని శేఖర్ కపూర్ సంపాదించుకున్నారు. "ఐ లవ్ న్యూయార్క్" అంటూ ర్యాంప్ పై నడిచిన నటి స్నేహ

తెలుగు, తమిళ నటి స్నేహ ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడిచింది. ప్రముఖ డిజైనర్ సిడ్నీ ఎస్.స్లాడెన్ రూపొందించిన దివాలీ స్పెషల్ కలెక్షన్స్ "ఐ లవ్ న్యూయార్క్" ర్యాంప్ లో ఆమె పాల్గొని ఆహూతులను అలరించింది. సిడ్నీ ఎస్ స్లాడెన్ కోలీవుడ్ లో ప్రముఖ డిజైనర్ గా పేర్గాంచాడు. "చంద్రముఖి" చిత్రంలో అతను రజినీకాంత్ డ్రెస్ డిజైనింగ్ చేశారు.
ప్రతిష్టాత్మకమైన "రెడ్ కార్పెట్ ఫిలిం రేటింగ్స్"(31/10/2007)

(గమనిక : ముందుగా సినిమా పేరు, వెంటనే ఆయా చిత్రానికి రెడ్ కార్పెట్ ఇచ్చిన రేటింగ్ లను చూడగలరు)
American Gangstar :Rating - R
(for violence, pervasive drug content and language, nudity and sexuality)

Bee Movie : Rating - PG
(for mild suggestive humor)
Darfur Now : Rating - PG
(for thematic material involving crimes against humanity)
Martian Child : Rating - PG
(for thematic elements and mild language)

RATINGS GUIDE
G : GENERAL AUDIENCES (All Ages Admitted)
PG : PARENTAL GUIDANCE SUGGESTED (Some Material May Not Be Suitable for Children) PG-13 : PARENTS STRONGLY CAUTIONED (Some Material May Be Inappropriate for Children Under 13)
R : RESTRICTED (Under 17 Requires Accompanying Parent or Adult Guardian)
NC-17 : NO ONE 17 AND UNDER ADMITTED
శ్రీవెంకట్ బులెమోని
శ్రీవెంకట్ బులెమోని
అమెరికా విమర్షకులను మెప్పించిన "బీ మూవీ" ఎక్స్ క్లూజివ్ వీడియో క్లిప్పింగ్
ప్రతిష్టాత్మక యానిమేషన్ చిత్రం "బీ మూవీ" నవంబర్ 2న అమెరికాలో విడుదలవనుంది. చిన్నారులను అలరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ చిత్రం అమెరికా విమర్షకుల అభినందనలు సహితం పొందింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి చెందిన ప్రత్యేకమైన వీడియో క్లిప్పింగ్ ను ఇక్కడ ఇస్తున్నాము. వీక్షించండి.
Tuesday, October 30, 2007
ఒక మంచి పని కోసం "ఓం శాంతి ఓం"-స్పెషల్ షో

"కరుణై" ఒక స్పెషల్ స్కూల్. శారీరకంగా, మానసికంగా పూర్తి స్థాయిలో అభివృద్ది చెందని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాల అది. విధి వంచితులైన ఆ చిన్నారులకోసం "పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్" తనవంతు కృషి చయడం కోసం ముందుకు వచ్చింది. దక్షిణ భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో 371 థియేటర్లు గల ఈ సంస్థ "సొరాప్టొమిస్ట్ డౌన్ టౌన్" స్వచ్చంద సంస్థతో కలిసి ఈ "కరుణై" పాఠశాలలో చదివే విద్యార్థుల సహాయానికై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "ఓం శాంతి ఓం" చిత్రం విడుదలకన్నా ముందే ప్రత్యేక షో వేస్తోంది. చెన్నైలోని సత్యం కాంప్లెక్స్ లో నవంబర్ 7వ తేదీన, సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రదర్షించే ఈ ప్రత్యేక షో వల్ల వచ్చే మొత్తాన్ని "కరుణై" పాఠశాలలోని విద్యార్థుల కోసం వినియోగించనున్నారు. కనుక ఆసక్తి పరులు ఈ ప్రత్యేక చిత్ర ప్రదర్శణలో చిత్రాన్ని చూసి, ఆ చిన్నారులకు తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఇతర వివరాలకోసం 9840106498 లేదా 9841003037 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
"ప్రేమ"లో గెలిచి "కుటుంబాన్ని" ఓడిపోయిన శ్రీజ

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ "ప్రేమ" లో గెలిచింది. ఏ మేరలో గెలిచిందంటే దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో గెలిచి తను ప్రేమ విజేతనని జగతికి చాటింది.ఇది ఒక విధంగా అభినందించదగ్గ విషయమే. అయితే ఏక కాలలో అదే ప్రేమకోసం మరి కొన్ని హృదయాల్లోని స్వచ్చమైన ప్రేమను కోల్పోయింది.
స్వచ్చమైన అని ప్రత్యేకంగా చెప్పడం వెనుక "శ్రీజ శిరీష్ భరద్వాజ్" లది స్వచ్చమైన ప్రేమ కాదని అనడం లేదు. అది స్వచ్చమైనదా, లేక ఉడుకు రక్తంతో చేసినదా, లేక మరేదైనా కారణం వల్ల జరిగిందా అనేది కాలం తప్పకుండా చెబుతుంది. అయితే ఆ కాలం తీర్పు వినాలంటే మరి కొన్నాళ్ళు గడవాలి. కనుక
స్థూలంగా చెప్పేదేమిటంటే శిరీష్ భరద్వాజ్ పేమను గెలుచుకున్న శ్రీజ, తన అమ్మా, నాన్న, తోబుట్టువు, అన్నయ్య, బాబాయ్...ఇలా ఎంతో మంది ప్రేమను కోల్పోయింది. అంటే శ్రీజ "ప్రేమ" లో గెలిచినట్లా, లేక "ఓడినట్లా" ఒక్కసారి ఆలోచించండి.మొదటి తప్పు కన్నా, రెండవ తప్పే చిరు కుటుంబాన్ని ఎక్కువ బాధించింది.ఇది నిజం. శ్రీజ పెద్దల ప్రమేయం లేకుండా తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ ను పెళ్ళి చేసుకోవడం వల్ల చిరు కుటుంబం కొంత బా
ధ పడిన విషయం అందరికీ తెలుసు. అయితే తదనంతరం ఆమె, తన భర్తతో కలిసి ఢిల్లీ కోర్టుకు ఎక్కి చిరు కుటుంబం వల్ల, చిరు అభిమానుల వల్ల తనకు, తన భర్తకు రక్షన కలిగించాలని కోరడం ఒక ఎత్తయితే, చిరంజీవి అధికారికంగా శ్రీజ లాయర్ పింకీకి లెటర్ వ్రాసిన తరువాత కూడా మీడియాలో కనిపించిన ప్రతిసారీ "అతని అభిమానుల వల్ల తన భర్తకు ముప్పు" అనో, లేక "తమను అధికారిక లాంచనాలతో రిసీవ్ చేసుకుని, గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి, తన అత్తవారింటికి పంపించాలని" చెప్పడం, లేదా "అతని అభిమానులకు తను చెప్పేదాకా మాకు రక్షణ కరువు" అనో, ఇంకొన్ని మార్లు "అతను మొండివాడయితే, నేను జగమొండిని" ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి తనవారిని మానసికంగా బాధపడేలా చేసింది. దాని పర్యవసానం...చివరికి చిరు కుటుంబం శ్రీజతో మాట్లాడటానికి కూడా సుముఖత చూపకపోవడమే. ఈ బాధనుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండటంకోసం ఏకంగా కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళడానికి సమాయత్తమయ్యారంటే వారు మానసికంగా ఎంత బాధ పడినట్లు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?
అంటే శ్రీజ గెలిచిన ప్రేమకోసం కోల్పోయిందేమిటి?
స్థూలంగా చెప్పేదేమిటంటే శిరీష్ భరద్వాజ్ పేమను గెలుచుకున్న శ్రీజ, తన అమ్మా, నాన్న, తోబుట్టువు, అన్నయ్య, బాబాయ్...ఇలా ఎంతో మంది ప్రేమను కోల్పోయింది. అంటే శ్రీజ "ప్రేమ" లో గెలిచినట్లా, లేక "ఓడినట్లా" ఒక్కసారి ఆలోచించండి.మొదటి తప్పు కన్నా, రెండవ తప్పే చిరు కుటుంబాన్ని ఎక్కువ బాధించింది.ఇది నిజం. శ్రీజ పెద్దల ప్రమేయం లేకుండా తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ ను పెళ్ళి చేసుకోవడం వల్ల చిరు కుటుంబం కొంత బా
ధ పడిన విషయం అందరికీ తెలుసు. అయితే తదనంతరం ఆమె, తన భర్తతో కలిసి ఢిల్లీ కోర్టుకు ఎక్కి చిరు కుటుంబం వల్ల, చిరు అభిమానుల వల్ల తనకు, తన భర్తకు రక్షన కలిగించాలని కోరడం ఒక ఎత్తయితే, చిరంజీవి అధికారికంగా శ్రీజ లాయర్ పింకీకి లెటర్ వ్రాసిన తరువాత కూడా మీడియాలో కనిపించిన ప్రతిసారీ "అతని అభిమానుల వల్ల తన భర్తకు ముప్పు" అనో, లేక "తమను అధికారిక లాంచనాలతో రిసీవ్ చేసుకుని, గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి, తన అత్తవారింటికి పంపించాలని" చెప్పడం, లేదా "అతని అభిమానులకు తను చెప్పేదాకా మాకు రక్షణ కరువు" అనో, ఇంకొన్ని మార్లు "అతను మొండివాడయితే, నేను జగమొండిని" ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి తనవారిని మానసికంగా బాధపడేలా చేసింది. దాని పర్యవసానం...చివరికి చిరు కుటుంబం శ్రీజతో మాట్లాడటానికి కూడా సుముఖత చూపకపోవడమే. ఈ బాధనుంచి కొన్నాళ్ళు దూరంగా ఉండటంకోసం ఏకంగా కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళడానికి సమాయత్తమయ్యారంటే వారు మానసికంగా ఎంత బాధ పడినట్లు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమేనా?
అంటే శ్రీజ గెలిచిన ప్రేమకోసం కోల్పోయిందేమిటి? కోల్పోయిన కన్న ప్రేమను తను తిరిగి పొందుతుందా?
పోనీ కొన్నాళ్ళయితే అంతా మరుగున పడుతుందనుకుంటే, మానసికంగా పడ్డ క్షోభ ఆ బాధను మరువనిస్తుందా? చివరికి శ్రీజకు ఎప్పటికైనా కన్నవాళ్ళు తిరిగి దక్కుతారా? ఒకప్పటి ప్రేమతో చేరదీస్తారా?
"శ్రీజ ప్రేమ"లో గెలిచి "కుటుంబాన్ని" ఓడిపోయిందనేదే.
శ్రీజ ఇంటర్వ్యూలు చూడలేక అమెరికాకు వెళ్ళిన చిరు కుటుంబం?

టెలివిజన్ చానళ్లలో శ్రీజ ఇంటర్వ్యూలు చూసిచూసి కుమిలిపోయిన చిరంజీవి కుటుంబం అమెరికాకు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికితోడు తన తండ్రి చిరంజీవి తమను ఆదరించి రిసెప్షన్ ఇవ్వాలని, ఆయన అభిమానులు తమపై దాడి చేసే అవకాశం ఉంది కనుక ఆయన తన అభిమానులకు "మేము కలిసిపోయామనే సందేశాన్ని, అధికారిక విలేఖరుల ఇంటర్వ్యూలో చెప్పాలని" శ్రీజ టీవీలో కనపడినపుడల్లా కోరుతుండడంతో చిరంజీవి కుటుంబంలోని వారిని మరింత బాధను కలిగించిందని అందుకే కొన్నాళ్లు హైదరాబాద్ కు దూరంగా ఉండాలని వారు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కన్నడ నుంచి డబ్బింగ్ అవుతున్న"మొగుడు పెళ్ళాం ఓ బాయ్‌ఫ్రెండ్"
పెళ్ళయిన తరువాత జీవితంలోకి బాయ్ ఫ్రెండ్ ప్రవేశిస్తే ఆ భార్య పయనమెటు? బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి భర్తను మోసం చేస్తే భర్త ఆ భార్యను ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే "మొగుడు పెళ్ళాం ఓ బాయ్‌ఫ్రెండ్" అని నిర్మాతలు వల్లభనేని వెంకటేశ్వరరావు, గుత్తికొండ మురళీమోహన్ చెబుతున్నారు. కన్నడలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులోకి దివ్యసాయి పిక్చర్స్ పతాకంపై అందిస్తున్నారు. రవి
శ్రీ వాస్తవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తగా విశాల్, భార్యగా సంజన, బాయ్‌ఫ్రెండ్‌గా తిలక్ నటించారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇప్పటికే ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందన్నారు. నవంబర్ రెండో వారంలో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన లొకేషన్ల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శృంగారం, సెంటిమెంట్
కలిసిన కుటుంబకథా చిత్రమిదని వల్లభనేని తెలిపారు.ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయని, గురుకిరణ్ సమకూర్చిన సంగీతం శ్రోతలను అలరిస్తుందని, త్వరలో ఆడియోను విడుదల చేస్తామని" అన్నారు.
మహేశ్ బాబు హీరోగా జేంస్ బాండ్ సిరీస్...!?

టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు త్వరలో జేంస్ బాండ్ గెటప్ లో దర్శనమివ్వనున్నట్లు టాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ హాటెస్ట్ ఫిలిం సిరీస్ అయిన జేంస్ బాండ్ తెలుగులో కూడా కొనసాగడం కోసం ముందస్తు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు వినికిడి. గతంలో అంటే 1970వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు, ఏజెంట్ గోపి-116 తదితర చిత్రాలు ఈ తరహాకు చెందినవే. వాటిని అప్పటి ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా మహేశ్ బాబు తో జేంస్ బాండ్ తరహా చిత్రాలను నిర్మించడం కోసం "అతిధి" దర్శకుడు సురేంద్ర సమాయత్తమౌతున్నట్లు తెలిసింది. ప్రాధమికంగా దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా తయారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రయ
త్నం పట్ల మహేశ్ బాబు కూడా ఉత్సాహం చూయించడంతో బాటు, ఈ సిరీస్ ను ఏదైనా కార్పోరేట్ కంపనీ సహకారం తో లేదా, కార్పోరేట్ కంపనీ నిర్మాణంలో నిర్మించాలని అనుకుంటున్నటు తెలిసింది. అందుకు ప్రారంభంగా కథ, కథనాలను తయారు చేసుకోమని సురేంద్రకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గానే వినిపిస్తోంది. చూద్దాం. ఈ ప్రయత్నం ఎంతవరకు వస్తుందో.
త్నం పట్ల మహేశ్ బాబు కూడా ఉత్సాహం చూయించడంతో బాటు, ఈ సిరీస్ ను ఏదైనా కార్పోరేట్ కంపనీ సహకారం తో లేదా, కార్పోరేట్ కంపనీ నిర్మాణంలో నిర్మించాలని అనుకుంటున్నటు తెలిసింది. అందుకు ప్రారంభంగా కథ, కథనాలను తయారు చేసుకోమని సురేంద్రకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గానే వినిపిస్తోంది. చూద్దాం. ఈ ప్రయత్నం ఎంతవరకు వస్తుందో.ఇప్పుడు "పౌర్ణమి" వంతు

తమిళనాట తెలుగు చిత్రాల హంగామాలో ఇప్పుడు "పౌర్ణమి" చిత్రం వంతు వచ్చింది. గతంలో మహేశ్ బాబు నటించిన "అతడు", "సైనికుడు" మొదలుకొని నిన్న మొన్నటి నాగార్జున "బాస్" దాకా తమిళనాట స్వై
ర విహారం చేసినవే. ఇక నాగార్జున "బాస్" తమిళ చిత్రాలకు పోటీగా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పుడు ప్రభాస్, త్రిశ,ఛార్మి లు నటించిన "పౌర్ణమి" చిత్రం తమిళనాట విడుదలకాబోతోంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే జెనీలియా, నితిన్ ల "సై" "ఖగజు" పరుతో రిలీజ్ కు రెడీగా ఉండగా, మరో వైపు వెంకటేశ్ , నయనతార నటించిన "తులసి" కూడా త్వరలో తమిళంలో విడుదలకానుంది. ఈ లెక్కన తమిళనాట తెలుగు చిత్రాల జోరు కొనసాగుతున్నట్లే కదా!
ర విహారం చేసినవే. ఇక నాగార్జున "బాస్" తమిళ చిత్రాలకు పోటీగా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పుడు ప్రభాస్, త్రిశ,ఛార్మి లు నటించిన "పౌర్ణమి" చిత్రం తమిళనాట విడుదలకాబోతోంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే జెనీలియా, నితిన్ ల "సై" "ఖగజు" పరుతో రిలీజ్ కు రెడీగా ఉండగా, మరో వైపు వెంకటేశ్ , నయనతార నటించిన "తులసి" కూడా త్వరలో తమిళంలో విడుదలకానుంది. ఈ లెక్కన తమిళనాట తెలుగు చిత్రాల జోరు కొనసాగుతున్నట్లే కదా!ముప్పై నిమిషాలలో ఆరు పాటలకు ట్యూన్స్ ఇచ్చిన ఇళయరాజా

మ్యూజిక్ మ్యేస్ట్రో ఇళయరాజాకు పరిచయం అక్కరలేదు. ఆబాలగోపాలాన్ని తన సంగీత స్వరాలతో ఓలలాడించిన ఈ సంగీత సామ్రాట్టు ఓ కొత్త రికార్డును సృష్టించాడు. ఇళయరాజాతో సహా ఎవరైనా సంగీత దర్శకుడు సాధారణంగా తమ పాటలకు ట్యూన్స్ కట్టడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటారు. ఒక్కో పాటకు కొన్ని రోజుల చొప్పున సినిమాలో ఉండే ఆరు పాటలకు సుమారుగా ఒక నెల రోజులనుంచి, నెలన్నరదాకా తీసుకున్న సందర్భాలూ ఉంటాయి. అయితే మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో ఆరు పాటలకు వీనులవిందైన ట్యూన్స్ ను అందించి దర్శక,నిర్మాతలతోబాటు సినీ పరిశ్రమనూ విస్మయానికి గురిచేశారు. ప్రముఖ దర్శకుడు పి వాసు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చంద్రనాథ్ తస్న తొలి చిత్రానికి ఇళయరాజాతో సంగీతాన్ని సమకూర్చుకోవాలని భావించాడు. తన మనసులోని ఆలోచన, చిత్ర నేపద్యం ఇళయరాజాకు చెప్పి ఇంటికి వెల్లేలోగా ఇళయరాజా నుంచి చంద్రనాథ్ కు పిలుపు వచ్చింది. అంతలోనే పిలిచాడంటే మరేదైనా సందేహమేమో అని భావించిన తనకూడా ఉన్న నిర్మాతతో సహా ఇళయరాజా ఇంటికి వెళ్ళగా, ఇళాయరాజా ఏకంగా తమ చిత్ర ట్యూన్స్ వినమంటూ, వినిపించేసరికి ఆ దర్శక,నిర్మాతలకు నోట మాట రాలేదని తెలిసింది. వీనులవిందైన ఆ పాటలు విని వెంటనే సాష్టాంగపడటం దర్శకుని వంతైందని సమాచారం. ఇళయరాజానా...మజాకా...!
వానొచ్చి జోరుపెరిగిన "మల్లన్న"

వర్షం వచ్చి చెన్నైలో ఎన్నో షూటింగ్ లకు అంతరాయం కలిగింది. కానీ విక్రం, శ్రియ జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం "మల్లన్న" మాత్రం వర్షంతో మరింత జోరందుకుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న "మల్లన్న" చిత్ర దర్శకుడు చెన్నైలోని బీచులో ఏకబిగిన వర్షంలోనే తన చిత్రీకరణను గావించాడు. దాంతో నిర్మాతకు కృత్రిమంగా వేయాల్సిన సెట్టు ఖర్చులు, కృత్రిమ వర్షం ఖర్చు మిగిలిపోయింది. రాబిన్ హుడ్ తరహా పాత్రలో విక్రం నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ కూడా విభిన్న తరహా పాత్రను పోశిస్తోంది. చెన్నై సముద్ర తీరం, బీచు పరిసర ప్రాంతాలు, మహాబలిపురం రోడ్డు తదితర పలు ప్రాంతాలలో ఈ షూటింగ్ ను కొనసాగించారు. మరో 15 రోజులపాటు ఇక్కడ చిత్రీకరణ జరిగిన తరువాత మొత్తం యూనిట్ కెన్యా, ఇటలీ లకు తరలి వెలుతుంది. వచ్చే ఏప్రిల్ 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదలచేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది.
Subscribe to:
Comments (Atom)




























