Monday, October 29, 2007

కామన్ మెన్ ప్రొటెక్షన్ అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ అర్థం చెప్పాలి-విలాసిని


కామన్ మెన్ ప్రొటెక్షన్ పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారని, అసలు ఆయనకు దీని పట్ల ఏమాత్రం చిత్త శుద్ది లేదని విలాసిని ఆరోపించారు. ఆయనవి వుత్తుత్తి మాటలే తప్ప చేతల్లొకి రాని ప్రగల్బాలని ఆమె తీవ్రంగా విమర్శించారు.

పిసిసి మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో కాల్పుల్లో మరణించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి భార్య విలాసినికి సహాయం అందించడానికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ నిరాకరించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సియంపిఎఫ్) వ్యక్తిగత సమస్యలను పట్టించుకోదని పవన్ విలాసినికి సమాచారం అందించారు. విలాసిని ఆయన కలవలేదు. పవన్ కళ్యాణ్ షూటింగులో ఉన్నారని, ఇప్పుడు కలవడానికి వీలు కాదని ఆమెకు సమాచారం వచ్చింది. వ్యక్తిగత సమస్యలు పట్టించుకోమని చెబుతున్న పవన్ కళ్యాణ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ అంటే అర్థమేమిటో చెప్పాలని విలాసిని అడిగారు. సియంపిఎఫ్ ద్వారా సాధారణ వ్యక్తులకు సహాయం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని, తనకు న్యాయం జరిగేందుకు తోడ్పడాలని కోరడానికి ఒక సాధారణ వ్యక్తిగా వచ్చానని ఆమె అన్నారు.

No comments: