Thursday, October 25, 2007

రేపు కనిపించే అతిపెద్ద "చంద్రుడు" ఇంతపెద్దగా కనిపిస్తాడంటారా..? (పే...ద్ద ఫోటో) మీకోసం

(గమనిక: ఈ వార్త చివరన ఉన్న ఫోటోపై క్లిక్ చేసి పెద్ద చిత్రాన్ని చూడండి)




ప్రతి ఏడాదికోసారి కనిపించే అతిపెద్ద చంద్ర దర్శనం శుక్రవారం కనిపించి, కనువిందు చేయనుంది. చందమామ రావే... జాబిల్లి రావే... అంటూ చిన్నారులను లాలించేందుకు ఎంత పిలిచినా దిగిరాని చంద్రుడు,శుక్రవారం మాత్రం భూమికి అతి దగ్గరగా రానున్నాడు. ఈ కారణంగా చంద్రుడు మామూలు పరిమాణం కంటే, అతిపెద్దగా కనిపించనున్నాడు. ఈ శుభ సందర్భంలో చందమామను తనివితీరా చూసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఏడాదికోసారి మాత్రమే వస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా కనిపించడం మామూలే. కానీ ఈ గురువారం, శుక్రవారాల్లో వచ్చే చంద్రుడు 14 శాతం పెద్దగా దర్శనమివ్వనున్నాడు. అలాగే చంద్ర వెలుగులు కూడా 30 శాతం అధికంగా విరజిమ్ముతాడని అమెరికాకు చెందిన నాసా నిపుణులు వెల్లడించారు. సాధారణంగా చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతాడు. ఆ సమయంలో భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న కనిష్ఠ దూరం 48 వేల కిలోమీటర్లు. ఈ పౌర్ణానికి భూమికి అతి సమీపానికి వచ్చే చందమామను మాత్రం టెలిస్కోప్‌లో తగిన ఫిల్టర్లు లేకుండా దర్శించడం నేత్రాలకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No comments: