సంచలనాత్మక శ్రీజ కేసును వాదించిన ప్రముఖ అడ్వకేట్ పింకీ ఆనంద్ కేసు ప్రారంభంలో తీసుకున్న మొత్తం అక్షరాల 25 లక్షలంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆతర్వాత తను కేసు పూర్వాపరాలు పరిశీలించినందుకు, వాదించినందుకు గంటకు రెండు లక్షల చొప్పున తీసుకుని శ్రీజ కేసు వాదించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.ఢిల్లీలోని ప్రముఖ లాయర్ మాత్రమే కాకుండా, భారతీయ జనతా పార్టీకి లీగల్ అడ్వైజర్ గా కూడా కొనసాగుతున్న పింకీ ఆనంద్ మామూలు సమయంలో శ్రీజ దంపతులకు దర్శనం లభించడమే గగనం. బలమైన రాజకీయ వ్యక్తుల సహాయ సహకారాలతో ఢిల్లీ మజిలీకి చేరుకున్న ఈ దంపతులు పింకీ ఆనంద్ ను కలిసి హై కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలియగానే, చిరంజీవి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకయ్య నాయుడితో మాట్లాడినా, పింకీ అప్పటికే కేసును కోర్టులో వేయడం అయిపోయిందని, ప్రస్తుతం తానేమీ చేయలేనని చెప్పినట్లు తెలిసింది. జరుగుతున్న వ్యవహారాలు, శ్రీజ ధైర్యంగా మాట్లాడటం వెనుక ఎంతో బలమైన శక్తులు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని, చేతిలో అత్తెసరు డబ్బులు మాత్రమే ఉన్న శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లు పింకీ ఫీజు 25 లక్షలు, మరియు కేసు వాదించినందుకౌ సుమారు 12 లక్షల డబ్బును ఎలా చెల్లించారని, అదంతా రాజకీయ అదృశ్య రాజకీయ శక్తుల ప్రోద్బలమేనని హైదరాబాద్ లో "కాంఫిడెన్షియల్ టాక్" వినిపిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment