
పవన్ కళ్యాణ్ నూతనంగా స్థాపించిన "కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"(సి ఎం పి ఎఫ్) కు రాష్ట్ర వ్యాప్తంగా విరాలాలు వెల్లువెత్తాయి. సోమవారం ఈ సంస్థను స్థాపిస్తూ పవన్ తన వంతుగా కోటి రూపాయల మొత్తాన్ని ప్రారంభ నిధిగా ప్రకటించడమే కాకుండా, దీనికి సంబంధించిన చెక్కును కూడా మీడియాకు చూయించడం అందరికీ తెలిసిందే. దీనికి అనూహ్యంగా స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం పెద్దయెత్తున పవన్ నివాసానికి తరలివచ్చి తమవంతుగా సంస్థ కోసం విరాళాలను ప్రకటిస్తూండటంతో పవన్ వారిని సున్నితంగా త్రొసిపుచ్చి, ప్రస్తుతానికి ఎలాంటి విరాలాలూ వద్దని, ముందుగా సంస్థను ప్రారంభించడానికి ఇతర వనరులు, సిద్దాంతాలు, కార్యకలాపాలు...ఇలా చాలా వ్యవహారాలున్నాయని, ముందుగా వాటిని పూర్తి చేయడం కోసం తనకు నైతిక మద్దతును అందిస్తే చాలునని నచ్చచెప్పారు. అందుకు అభిమానులు పవన్ కు ఎళ్ళవేళలా తోడు ఉంటామని వాగ్ధానం చసినట్లు తెలిసింది. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్"(సి ఎం పి ఎఫ్)ను పూర్తిస్థాయిలో వ్యవస్థీకృతం చేసేంత వరకు విరాళాలు, ఇతర నిధుల ప్రస్థావన తీసుకురావద్దని, రెండో దశ పనుల్లోకి వెళ్ళేకన్నా ముందు మొదటి దశను విజయవంతంగా పూర్తిచేయవలసి ఉందని ఆయన తన అభిమానులకు తెలిపినట్లు తెలిసింది.
No comments:
Post a Comment