Monday, October 22, 2007

తెలుగు "బంటీ ఔర్ బబ్లీ" లుగా తరున్, ఇలియానా...!తరున్, ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం కథ తెలిసిపోయింది. హిందీలో వచ్చిన అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీల చిత్రం "బంటీ ఔర్ బబ్లీ" ఆధారంగా ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలిసింది. హిందీ చిత్రంలో తోడు దొంగల్లా నటించిన అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీల పాత్రలను తెలుగులో తరున్, ఇలియానాలు పోశించనున్నారు. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్ పోశించిన పాత్రను నటుడు జగపతి బాబు పోశించనున్నాడు. మొత్తానికి ఈ చిత్రం హిందీ "బంటీ ఔర్ బబ్లీ" ఆధారంగానే రూపొందుతోందని తెలిసింది. అయితే తెలుగులో ఏం పేరు పెట్టాలా అని దర్శక, నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

No comments: