Monday, October 22, 2007

చిరంజీవిని పరామర్శించిన బాలకృష్ణ
"శ్రీజ అకస్మాత్తుగా వివాహం చేసుకున్న తర్వాత తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతి చెందిందని" నటుడు బాలకృష్ణ అభిప్రాయ పడ్డారు. ఆయన చిరంజీవిని చిరంజీవి స్వగృహంలో కలిసి పరామర్శించారు. సతీసమేతంగా చిరంజీవి ఇంటికి వచ్చిన బాలకృష్ణ చిరంజీవి ఇంట్లో గంటకుపైగా గడిపినట్లు తెలిసింది. చిరంజీవి, ఆయన సతీనణితోబాటు ఇతర కుటుంబ సభ్యులను పలకరించిన బాలకృష్ణ "చిరంజీవి కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమతోబాటు తెలుగు ప్రజలందరూ తోడుగా ఉంటారని, శ్రీజ క్షేమంగా ఉంటుందని" ధైర్యం చెప్పినట్లు తెలిసింది.

No comments: