చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమించి పెళ్ళి చేసుకున్న శిరీశ్ భరద్వాజ్ పై 2002 లోనే కిడ్నాప్ కేసు బుక్ అయింది. 2002ల్, మార్చి నెలలో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురైన మైనర్ బాలిక(15)ను ప్రేమ పేరుతో తీసుకువెళ్ళినందుకు హైదరాబాదులోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ అయింది. అప్పట్లో ఐ పి సి 363 సెక్షన్ కింద (ఎఫ్ ఐ ఆర్ నెం.229/2002) బుక్ చేసిన ఈ కేసులో శిరీశ్ భరద్వాజ్ ను పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోం కు తరలించారు. మైనర్ బాలికను తీసుకు వెళ్ళడమే కాకుండా, ఆమెను పెళ్ళి సహితం చేసుకున్నాడనీ, అయితే వారిద్దరూ మైనర్లు కావడంతో కోర్టు ఈ పెళ్ళిని ఒప్పుకోలేదని తెలిసింది. అప్పుడు ఈ కేసులో అతని తల్లిదండృలను కూడా నిందితులుగా పేర్కొన్నా, వారు ముందస్తు బెయిల్ పొందడంతో వారిని పోలీసులు అరెస్టు చేయలేదు. అదే నెల 30వ తేదీన ఈ కేసు కోర్టుకు రాగా బాధితులు హాజరు కాక పోవడంతో ఈ కేసును కొట్టివేశారు. అప్పుడు కూడా స్థానిక ఎం ఎల్ ఎ పి జనార్ధన్ రెడ్డి అనుచరులు ఆ పారిశ్రామిక వేత్తను బెదిరించడం వల్ల అతను కోర్టుకు వెళ్ళలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment