Monday, October 29, 2007

హాలీవుడ్ "లవ్ డాక్టర్" = పవన్ కళ్యాణ్ "జల్సా"
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇలియానా జంటగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానరుపై నిర్మిస్తున్న "జల్సా" చిత్రం హాలీవుడ్ "లవ్ డాక్టర్" చిత్రానికి ప్రీమేక్ అని టాలీవుడ్ సమాచారం. "ఖుషి" చిత్రం తర్వాత ఆతరహా ప్రేమ కథలో పవన్ నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ మార్కెట్ అభిప్రాయంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబధించి కేవల మూడు పాటలు, మూడు ఫైట్లు, మరో అయిదు రోజుల టాకీ తప్ప మిగిలిన షూటింగ్ మొత్తం పూతయిందని, చిత్రంలోని పాటలు బాగా వచ్చాయని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి ంపర్వదినోత్సవం సందర్బంగా జనవరి 14వ తేదీన విడుదలచేయడానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు తెలిసింది.

No comments: