Monday, October 22, 2007

మా నాన్న, మా బాబాయ్ అభయమిస్తే మేము హైదరాబాదు వస్తాము: "ఢిల్లీ హైకోర్టులో" చెప్పిన శ్రీజ


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం సినిమా పక్కీలోనే పలు మలుపులు తిరుగుతోంది. గత బుధ వారం హైదరాబాదులో తల్లిదండృలకు తెలియకుండా పెళ్ళి చేసుకున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లు పెళ్ళి చేసుకున్న రోజునే రోడ్డు ప్రయాణం ద్వారా గోవా చేరుకున్నారు. అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఈ కొత్త జంట అడ్వకేట్ పింకీ ఆధ్వర్యంలో ఢిల్లీ లోని నార్థ్ జోన్ డి జి పి ని కలిసి మాకు రక్షణ కలిగించాల్సిందిగా విగ్నప్తి చేశారు. అలాగే పింకీ ఆద్వర్యంలెనే ఈ రోజు ఢిల్లీ లోని హైకొర్టును ఆశ్రయించిన ఈ జంట తమకు తమ బంధువులనుంచి, చిరంజీవి, పవన్ కళ్యాన్ ల అభిమానులనుంచి రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీజ కోర్టులో మాట్లాడుతూ తన తండ్రి చిరంజీవి, తమ బంధువులు తమ పెళ్ళిని అంగీకరించడం వల్ల తాము సంతోశంగా ఉన్నామని, అయితే ఆయన అభిమానులపై తమకు నమ్మకం లేదని చెప్ప్రు. తన తండ్రి చిరంజీవి, తన బాబాయ్ పవన్ కళ్యాన్ లు హామీ పత్రం ఇస్తే తాము ధైర్యంగా హైదరాబాదుకు వస్తామని వారు కోర్టులో చెప్పారు. రాష్ట్ర పోలీసులనుంచి ఫోన్ ద్వారా ప్రాధమిక సమాచారం తెలుసుకున్న కోర్టు, శిరీష్ భరద్వాజ్ పై ఉన్న 2002 నాటి కిడ్నాప్ కేసు విషయం ప్రశ్నించగా, అది అప్పట్లోనే సమసిపోయిందనీ, దానిని తిరగదోడడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని శిరీష్ భరద్వాజ్ కోర్టుకు తెలిపాడు. ప్రస్తుతానికి రక్షణ కలిగించాల్సిందిగా పోలీసులను ఆదేశించిన కోర్టు కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

No comments: