Monday, October 29, 2007

మా నాన్న మొండి అయితే, నేను జగమొండిని : మీడియాతో శ్రీజ


నాదంతా మా నాన్న పోలిక అంటారు. మా నాన్న మొండి అయితే నేను జగమొండిని. ఏవిషయమైన నేను ఇంతే. మామ్మా నాన్నలు పిలిచేదాకా నేను మా ఇంటికి వెళ్ళదలచుకోలేదని శ్రీజ ఢిల్లీలో పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి మీడియాతో పలు దఫాలుగా మాట్లాడిన శ్రీజ పలు అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎవరెంత చెప్పినా శిరీష్ భరద్వాజ్ కు ఇంకా ప్రమాదం పొంచి ఉందని నాకు అనిపిస్తోందని, ఈ విషయంలో మా నాన్న తన అభిమానులకు "మేము కలిసి పోయాము, నా కూతురిని, అల్లుడిని ఏమీ చేయవద్దని మీడియా ముఖంగా చెబితేగానీ, మేము పూర్తి నమ్మకంతో ముందుకు సాగలేమని, ప్రస్తుతానికి మరికొన్ని రోజులు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు రాదలచుకోలేదని శ్రీజ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చినా నేను ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళనని, మా కుటుంబీకులనుంచి అధికారికమైన ఆహ్వానం అందితేనే నేను మా ఇంటికి వెళతానని, ఈ విషయంలో మా నాన్నకన్నా మొండిగా వ్యవహరించదలచినట్లు శ్రీజ మీడియాకు చెప్పింది.

No comments: