
మ్యూజిక్ మ్యేస్ట్రో ఇళయరాజాకు పరిచయం అక్కరలేదు. ఆబాలగోపాలాన్ని తన సంగీత స్వరాలతో ఓలలాడించిన ఈ సంగీత సామ్రాట్టు ఓ కొత్త రికార్డును సృష్టించాడు. ఇళయరాజాతో సహా ఎవరైనా సంగీత దర్శకుడు సాధారణంగా తమ పాటలకు ట్యూన్స్ కట్టడానికి కొన్ని రోజుల సమయం తీసుకుంటారు. ఒక్కో పాటకు కొన్ని రోజుల చొప్పున సినిమాలో ఉండే ఆరు పాటలకు సుమారుగా ఒక నెల రోజులనుంచి, నెలన్నరదాకా తీసుకున్న సందర్భాలూ ఉంటాయి. అయితే మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో ఆరు పాటలకు వీనులవిందైన ట్యూన్స్ ను అందించి దర్శక,నిర్మాతలతోబాటు సినీ పరిశ్రమనూ విస్మయానికి గురిచేశారు. ప్రముఖ దర్శకుడు పి వాసు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చంద్రనాథ్ తస్న తొలి చిత్రానికి ఇళయరాజాతో సంగీతాన్ని సమకూర్చుకోవాలని భావించాడు. తన మనసులోని ఆలోచన, చిత్ర నేపద్యం ఇళయరాజాకు చెప్పి ఇంటికి వెల్లేలోగా ఇళయరాజా నుంచి చంద్రనాథ్ కు పిలుపు వచ్చింది. అంతలోనే పిలిచాడంటే మరేదైనా సందేహమేమో అని భావించిన తనకూడా ఉన్న నిర్మాతతో సహా ఇళయరాజా ఇంటికి వెళ్ళగా, ఇళాయరాజా ఏకంగా తమ చిత్ర ట్యూన్స్ వినమంటూ, వినిపించేసరికి ఆ దర్శక,నిర్మాతలకు నోట మాట రాలేదని తెలిసింది. వీనులవిందైన ఆ పాటలు విని వెంటనే సాష్టాంగపడటం దర్శకుని వంతైందని సమాచారం. ఇళయరాజానా...మజాకా...!
No comments:
Post a Comment