Monday, October 22, 2007

ఢిల్లీ హైకోర్టులో రక్షణ కోరిన శ్రీజ, శిరీష్ బరద్వాజ్ : పోలీసులకు తుపాకీ అందచేసిన పవన కళ్యాణ్


తమకు రక్షణ కల్పించాలంటూ చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ మరియు ఆమె భర్త శిరీష్ భరద్వాజ్‌లు న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తన దగ్గరున్న రివాల్వర్‌ను సినీనటుడు పవన్ కళ్యాణ్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీజ దంపతులకు తమ నుంచి ఎటువంటి ప్రాణహాని కలుగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన నుంచి ప్రాణాపాయం కలిగే అవకాశముందని శ్రీజ తెలిపడం పట్ల పవన్‌కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నవదంపతులు ఎక్కడ ఉన్నా... క్షేమంగా ఉండాలనే ఆశిస్తున్నామన్నారు. తమ పక్షంలో ప్రేమ, ఆప్యాయతలను పంచే అభిమానుల సమాజమే ఉందని... గూండాలు తమ వశం లేరని ఆయన ఉద్ఘాటించారు. తమ అభిమానులు ఇలాంటి ప్రాణాపాయ చర్యల్లో నిమగ్నం కారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. శిరీష్‌ను తాను ఏమీ చేయనని మీడియా సమక్షంలో హామీ ఇచ్చారు. దీనికోసం రక్షణ కోరుతూ శ్రీజ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. శిరీష్‌పై కేసులుండటం తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. శ్రీజ భవిష్యత్త్‌పైనే తాము ఆందోళన చెందుతున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శ్రీజ దంపతులు తన గృహానికి గానీ, అన్నయ్య చిరంజీవి గృహానికి గానీ వస్తే సాదర స్వాగతం పలుకుతామన్నారు.

No comments: