ప్రముఖ్ సినిమా రూపకర్త శేఖర్ కపూర్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. టర్కీలోని అంటాల్యాలో ఆదివారం ప్రారంభమైన మూడవ అంతర్జాతీయ యూరాసియా చలనచిత్రోత్సవంలో శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన "ఎలిజబెత్: ది గోల్డెన్ ఏజ్" చిత్రం ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమయ్యింది. ఆ విధంగా సినిమా రంగానికి శేఖర్ కపూర్ అందించిన సేవలకు ప్రత్యేక గౌరవాన్ని చిత్రోత్సవం అందించింది. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ ప్రసంగిస్తూ టర్కీ దేశం ఐరోపా, ఆసియా ఖండాల మధ్య సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నదని అన్నారు. తద్వారా ప్రాచ్య దేశాల స్థానానికి చేరుకునేందుకు టర్కీ భౌగోళిక పరిస్థితులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. "మౌసమ్", "మిస్టర్ ఇండియా" మరియు "బాండీట్ క్వీన్" హిందీ చిత్రాల ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకునిగా తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని శేఖర్ కపూర్ సంపాదించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment