Thursday, October 25, 2007

సి ఎం కు ఫోన్ చేసిన చిరంజీవి...!?


ప్రముఖ నటుడు చిరంజీవి ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. శ్రీజ వివాహం తర్వాత చిరంజీవి తనకు తానుగా దాదాపు ఎవరికీ ఫోన్ చేయడం లేదు. అలాంటిది మొదటిసారిగా చిరంజీవి ఈరోజు వై ఎస్ ఆర్ కు ఫోన్ చేసి శ్రీజతో ఫోన్లో మాట్లాడే ఏర్పాటు చేయవలసిందిగా కోరినట్లు తెలిసింది. గత 19వ తేదీన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, ఈరోజు చిరంజీవి వై ఎస్ ఆర్ కు ఫోన్ చేసి, తనకు శ్రీజతో ఒకసారి మాట్లాడాలని ఉందనీ, తను మానుంచి ఎలాంటి కీడును శంకించాల్సిన పని లేదని, ఒక వేల శ్రీజ రమ్మంటే తాము ఢిల్లీకి వెళ్ళి కోర్టులో తగిన పత్రాలు సమర్పించి శ్రీజను, శిరీష్ భరద్వాజ్ ను వెంటబెట్టుకుని రావడానికి సిద్దమేనని ఆయన చూచాయనగా సి ఎం తో అన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. శ్రీజ చిన్న తనంతో స్పందిస్తోంది, దనిని మనసులో ఉంచుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిరంజీవికి సూచించినట్లు సమాచారం. అయితే ఈ ఫోను వ్యవహారం గూర్చి విలేఖరులు ముఖ్యమంత్రి కార్యాలయంలో సంప్రదించగా, అలాంటిదేమీ లేదని వారు తెలిపినట్లు తెలిసింది. అయితే ఫిలిం నగర్లో మాత్రం ఈ విషయం గట్టిగానే చర్చించుకుంటున్నట్లు తెలిసింది.

No comments: