Monday, October 29, 2007

కమల్ హాసన్ డ్రీం ప్రాజెక్ట్ "మరుదనాయగం" (ట్రైలర్ ఖర్చు రెండు కోట్లు మాత్రమే)(వీడియో)

భారత దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు కమల్ హాసన్. పరిచయం అక్కరలేని ఈ నటుడి కల "మరుదనాయగం" చిత్రంలో నటించాలని. అందుకోసం కొన్ని సంవత్సరాల క్రితమే కథ, కథనం సహా ట్రైలర్ని కూడా కమల్ హాసన్ రూపొందించారు. అయితే అంచనాలకు మించిన బడ్జెట్ వల్ల ఈ చిత్రం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. ఈ చిత్ర రమారమి ప్రస్తుత బడ్జెట్ సుమారు 500ల కోట్ల రూపాయలు. కానీ తన జీవిత చరమాంకంలోగా ఈ చిత్రం చేయాలనే స్థిర చిత్తం కమల్ హాసన్ లో ఉంది. అతని స్థిర చిత్త ఎంత బలమైనదంటే ఈ చిత్రం కోసం నిర్మించిన ట్రైలర్ కే సుమారు రెండు కోట్ల రూపాయలను ఆయన ఖర్చు పెట్టారు. మరి ఈ చిత్రాన్ని మనం చూస్తామో, లేదో తెలీదు, కానీ దీని ట్రైలర్ని మాత్రం తప్పకుండా చూడండి.

No comments: