Thursday, October 25, 2007

దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న "టక్కరి"


"వెళ్ళవయ్యా..వెళ్ళూ..." డైలాగుతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న "జయం" జంట సదా, నితిన్ ల మరో చిత్రం "టక్కరి" ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్, సదా నటించిన "జయం" చిత్రం సూపర్ డూపర్ హిట్‌ను సాధించిన విషయం తెల్సిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో "టక్కరి" చిత్రం రూపుదిద్దుకుంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరచూరి శివరామ్ ప్రసాద్ నిర్మిస్తున్న "టక్కరి" చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "అమ్మ" రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, చక్రీ సంగీతం సమకూర్చారు. చిత్ర నిర్మాత శివరామ్ ప్రసాద్ పత్రికలవారితో మాట్లాడుతూ నితిన్-సదా జంట అనగానే "జయం" సినిమా గుర్తుకువస్తుందని, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం "టక్కరి" అంతకు మించిన విజయం సాధిస్తుందని అన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నారు. మిగిలిన పాత్రల్లో చంద్రమోహన్, సాయాజీ షిండే, ఆలీ, రఘుబాబు, సత్యం రాజేష్, సుధ, గీతాసింగ్, వేణు, బేబి త్రిష తదితరులు నటించారు.

No comments: