Monday, October 29, 2007

"శ్రీ" జంటకు మరో రెండు వారాల పోలీసు రక్షణ : కోర్టు తీర్పు


చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్ భరద్వాజ్ కు, శ్రీజకు మరో రెండు వారాల పాటు పోలీసు రక్షణను పొడింగించ వలసిందిగా ఢిలీ హై కోర్టు ఈ రోజు పోలీసులను ఆదేశించింది. చిరంజీవి తన న్యా వాది ద్వారా తాము శ్రీజకు, ఆమె భర్త శిరీష్ భరద్వాజ్ కు ఎలాంటి హానీ తలపెట్టబోమని, అనవసరంగా చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేయడం, మీడియాకు ఎక్కడం తమను బాధించిందని కోర్టుకు తెలియజేశాడు. కోర్టు శిరీష్ బెదిరిపు కాల్స్ ఏమైనా వచ్చాయా అని అడిగినట్లు తెలిసింది. దానికి శిరీష్ అలాంటివేమీ లేదని, కాని తన మితృలకు మాత్రం కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని కోర్టుకు తెలిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కోర్టు మరో రెండు వారాలపాటు వీరికి రక్షణను పొడిగించింది. వీరు హైదరాబాదుకు చరుకోగానే రక్షణ భాద్యతలను హైదరాబాదు పోలీసులు చూసుకోవలసిందిగా కోర్టు సూచించింది. ఈ సందర్భంగా శ్రీజ తన తల్లిదండృలను తమను మన్నించాల్సిందిగా లాయర్ పింకీ ఆనంద్ ద్వారా విజ్ఞప్తి చేయించింది. ఒకరిపై మరికరికి ఉన్న ప్రేమతో, చిన్నతనంతో చేసిన చిన్న తప్పును క్షమించవలసిందిగా శ్రీజ తన తల్లిదండృలను కోరుతున్నట్లు పింకీ తెలిపింది. చిరంజీవి తరుపు లాయర్ మాట్లాడుతూ చిరంజీవి కుటుంబం శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల వివాహాన్ని స్వాగతిస్తోందని తెలియజేశాడు. ఒక విధంగా ఈ కేసు ఇంతటితో ముగిసినట్లేనని ఢిల్లీ మీడియా అభిప్రాయపడుతోంది.

No comments: