Saturday, October 27, 2007

మమ్మల్ని క్షమించండి: శిరీష్ భరద్వాజ్


తాము ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని తమ రెండు కుటుంబాలను కోరుతున్నామని శిరీష్ భరద్వాజ్ కోరాడు. ఢిల్లీ కోర్టు అనుమతి లేదా, సూచనలతో వారం రోజులలోగా తాము హైదరాబాదు వెళ్ళదలచినట్లు శిరీష్ పేర్కొన్నాడు. శ్రీజతో కలిసి అతను ఢిల్లీలోని ఎపి భవన్ కు వచ్చిన సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో శిరీష్ మాట్లాడాడు.మా కుటుంబ సభ్యులతో , అమ్మ, నాన్నలతో శ్రీజ మాట్లాడిందని, వారు సానుకూలంగా స్పందించారని అన్నాడు. జరిగిందేదో జరిగింది, ప్రెస్సుకు వెళ్లడం వంటి పనులు మానుకుని ఇంటికి రమ్మన్నారని అతను చెప్పాడు. రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిరితే మంచిదని అతను అన్నాడు. తమను క్షమించాలని తాము ఇది వరకే కోరామని, ఇప్పుడు కూడా కోరుతున్నామని అతను అన్నాడు. భద్రత కారణాల రీత్యా తమ కారు నెంబరు కవర్ చేసినట్లు అతను తెలిపాడు.

No comments: