బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసినందుకు గాను "బాలీవుడ్ బాద్షా" షారుఖ్ ఖాన్ కు నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ (ఎన్ ఒ టి ఇ) శుక్రవారం లీగల్ నోటీసు పంపింది. ఇటీవల ముంబైలో జరిగిన ట్వంట్వీ20 క్రికెట్ మ్యాచ్‌లోను మరియు ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా షారుఖ్ ఖాన్ ధూమపానం చేసినట్లు జాతీయ పొగాకు నిరోధక సంస్థ తన నోటీసులో ప్రస్తావించింది. ఇదిలా ఉండగా ఇదే సంస్థ గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పొగతాగుతున్న భంగిమల్లో సినిమా స్టిల్స్‌లో కనిపించినందుకుగాను అమితాబ్‌కు నోటీసు పంపింది. ఈ వివాదంపై న్యాయవిచారణ కొనసాగుతుండగానే తాజాగా షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు అదే తరహా నోటీసును పంపింది. పొగాకు నిరోధక చట్టాన్ని అనుసరించి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్టం ఆసరాతో షారూఖ్ ఖాన్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగేందుకు ఎన్జీవో రంగం సిద్ధం చేసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment