పవన్ కళ్యాణ్ స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో వాలంటీర్ల రిక్రూట్ మెంట్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించాడు. తాను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా స్పందన అనూహ్యంగా వచ్చిందని ఆయన తెలిపాడు. చాలా మంది డొనేషన్లు అందజేస్తామంటున్నారని, అయితే తనకు డొనేషన్ల కన్నా రక్షణ కవచాల్లా వ్యవహరించే వాలంటీర్లే ముఖ్యమని ఆయన పేర్కొన్నాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇష్టమున్నవారు సభ్యులు కావచ్చని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపాడు. సామాజిక సేవచేయడానికి వాలంటీర్లు తమ వంతు సేవ చేయడానికి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉపయుక్తమవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి డబ్బు అవసరం లేదని, ఒకవేళ డబ్బే కనుక అవసరమైతే ప్రకటన విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చేరాలనుకుంటున్న వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, లేక మరే దేశంలో ఉన్నా అక్కడినుంచే సంస్థ కార్యకలాపాలలో పాలుపంచుకోవచ్చని, ఆసక్తి గల వారు +91(40)9866344833,+91(40)9866344733 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చునని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment