
పవర్ స్టార్ పవన్ కల్యాన్ పవర్ ఏమిటో పవన్ పిలుపునిచ్చిన కొద్ది సేపటికే అవగతమైంది. రాష్ట్రవ్యాప్తంగా కదిలిన యువతరం ఒక్కసారిగా "కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జిందాబాద్", "పవన్ జిందాబాద్" అంటూ కాలేజీలను ఎగ్గొట్టిమరీ బారులుతీరడం పలువురిని ఆష్చర్యానికి గురిచేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. హైదరాబాద్ నగరంలో మంగళవారంనాడు అరోరా, అవంతి కాలేజీ విద్యార్థులు మూకుమ్మడిగా స్పందించి క్షణాల్లో లక్షల రూపాయల
ను కూడగట్టారు. ర్యాలీలు తీశారు. ఈ స్పందనలో ఎక్కువగా అమ్మాయిలే ఉండడం విశేషం.రాజమండ్రిలోనూ బుధవారం ర్యాలీలు తీశారు. స్నేహ యూత్ క్లబ్, రాజమండ్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్, చిరంజీవి ఫ్యాన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పవన్ పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జిందాబాద్, పవన్ జిందాబాద్ అంటూ కదిలారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫోర్స్ కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వారీ సందర్భంగా అన్నారు.

1 comment:
Pavan idhedho aavesam lo chesinattu anipisthundhi.ento pich fans ..
Post a Comment