Wednesday, October 24, 2007

జెస్సీ మెట్ కాఫ్ తో హాలీవుడ్ సినిమాలో నటించనున్న శ్రియా సరన్


శివాజీ సినిమా శ్రియా జీవితాన్నే మలుపుతిప్పింది. ఇలియానా, త్రిషా, నయనతార ఊపుతో తెలుగులో అవశాలు లేని పరిస్థితిలో శ్రియాకు శివాజీ సినిమా వరంలా వచ్చింది. సినిమా నిర్మాణం ఆలస్యమయినా విడుదల అయిన తరువాత పెను సంచలనమే సృష్టించింది. విజయం ఇచ్చిన కిక్కు శ్రియాను అవకాశాల వెల్లువలో కొట్టుకుపోయేలా చేస్తోంది. తమిళ సినిమాలలో అవకాశాల మీద అవకాశాలు ఆమె తలుపు తట్టుతున్నాయి. బాలీవుడ్ లోనూ శ్రియా అవారాపన్ సినిమాలో నటించేలా చేసింది. ఇపుడు ఆమె ఎంతటి క్రేజ్ ను సంపాదించిందంటే ఒక ఐటమ్ సాంగ్ కే 50 లక్షల రూపాయలు సంపాదించిపెట్టేలా చేస్తోంది.ఇదిలా ఉంటే శ్రియాకు తాజాగా హాలీవుడ్ అవకాశం వచ్చింది. జెస్సీ మెట్ కాఫ్ తో నటించే అద్భుత అవకాశం లభించింది. హైడ్ పార్క్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్(ప్రకాశ్ అమృత్ రాజ్ స్వంత నిర్మాణ సంస్థ) నిర్మించే ఈ సినిమా కాల్ సెంటర్ నేపథ్యంలో సాగుతుంది. కాగా మెట్ కాఫ్ ప్రస్తుతం డెస్పరేట్ హౌజ్ వైవ్స్ సినిమాలో చేస్తున్నాడు.

No comments: