Thursday, October 25, 2007

చివరి షెడ్యూల్ ప్రారంభమైన టబు చిత్రం


బాలీవుడ్ నటి టబు, అబ్బాస్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. "ఆ నలుగురు" ఫేం దర్శకుడు చంద్రసిద్ధార్థ ఫిల్మోత్సవ్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. పతంజలి రాసిన "నువ్వే కాదు" అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రం మానవ నైజాన్ని తెలిపై సస్పెన్స్ థ్రిల్లర్. ఆద్యంతం వినోదాన్ని పంచే సన్నివేశాలు చిత్రంలో అధికంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం ఐదు పాటలు ఉండే ఈ చిత్రంలో టబు ఓ గమ్మత్తైన పాత్రలో నటిస్తుండగా, రాజా ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు నుంచి నవంబరు నెలాఖరు వరకు జరుగుతుంది. చైతన్య ప్రసాద్ రాసిన "పట్టు చీర కట్టి పూలెట్టుకెళితే" అనే పాటను టబు, తదితరులపై చిత్రీకరించినట్టు చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, సునీల్, చలపతి రావు, కృష్ణమోహన్, సూర్య, సుమన్ శెట్టి, హేమ, అపూర్వ, మెల్కోటే, బేబి పూజా జాస్మిన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, కెఎన్.వై.పతంజలి, ఛాయాగ్రహణం.. జెకె.గుమ్మడి, ఎడిటింగ్.. రుద్ర.

No comments: