శ్రీజ వ్యవహారం ఢిలీ కోర్టుముంగిట్లో నిలిచిన ప్రస్తుత పరిస్థితిలో ఈ వ్యవహారంపై భవిష్యత్తులో ఎలా స్పందిచాలనే విషయమై చిరంజీవి కుటుంబంలో విభిన్న ఆలోచనలు తలెత్తినట్లు టాలీవుడ్ సమాచారం. తమ ఇరు కుటుంబాలూ కలిసి అధికారికంగా పెద్ద యెత్తున హైదరాబాదులో తమ పెళ్ళి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే తప్ప తాము హైదరాబాదుకు వచ్చేది లేదని శ్రీజ ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో తేల్చి చెప్పిన ప్రస్తుత తరుణంలో చిరంజీవి కుటుంబంలో విభిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయని తెలిసింది. శ్రీజ కోరికకు తగ్గట్లే పెద్ద యెత్తున రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని కొందరు భావిస్తుండగా, అలా చేయడం సరికాదని, ఇంత చేసిన శ్రీజ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే "తాన తందానా..." అంటూ వత్తాసు పలికినట్లు వ్యవహరించడం మంచిది కాదని కొందరి వాదన. శ్రీజ కోరినట్లు తము శిరీష్ భరద్వాజ్ తల్లిదండృలదగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి తీసుకురావడం సరైన నిర్ణయమేనా అని వారు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ రెండు కుటుంబాలవారితో నేను మాట్లాడి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తానని చెప్పిన అల్లు అరవింద్ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకుండా, ప్రస్తుతానికి ఢిల్లీ వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. వచ్చే సోమవారం జరిగే సంఘటనలను బట్టి, అప్పటి కోర్టు తీర్పు, శ్రీజల ఆలోచనలను బట్టి అందుకు తగ్గట్లుగా తగిన నిర్ణయాలను అప్పుడే తీసుకోవాలని అతను భావిస్తున్నట్లు తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ సంఘటన జరిగిన దగ్గర్నుంచి కేవల మూడు మార్లు మాత్రమే చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. రేణుకా దేశాయ్ ఎక్కువ సమయాన్ని చిరంజీవి ఇంట్లోనే గడుపుతొంది. చిరంజీవి మరో తమ్ముడు నాగేంద్ర బాబు ఎక్కువగా చిరంజీవి వ్యవహారాలను చూస్తున్నట్లు తెలిసింది. వచ్చిపోయే వారిని నాగేంద్ర బాబే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతానికి చిరంజీవి మాత్రం మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment