
విక్టరీ వెంకటేశ్ నటించిన కొత్త చిత్రం "తులసి" శాటిలైట్ హక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా పత్రికా, శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. జగన్ స్థాపించనున్న జగన్ టి వి కోసం "తులసి" హక్కులను కొన్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వశనీయంగా తెలిసింది. ఇందుకోసం రెండు కోట్లకు పైగా వెచ్చించినట్లు తెలిసింది. కాగా ఉపగ్రహ హక్కులకోసం ఇంత పెద్ద మొత్తం వెచ్చించడం తెలుగుసినీ పరిశ్రమలో ఇదే మొదటిసారి.
No comments:
Post a Comment