1. ఊరించి దెబ్బ కొట్టిన "అతిధి" మొదటి నాలుగు రోజుల కలెక్ష్న్ పరంగానే మహేశ్ బాబు "అతిధి" మొదటి స్థానాన్ని ఆక్రమించింది తప్ప సినిమాలో ఏమీ లేదని టాలీవుడ్ టాక్. సినిమాకు హీరో కేంద్ర బిందువు కావడంలో తప్పు లేదు కానీ, హీరోనే మొత్తం కావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారని పరిశ్రమ అంటోంది. కథ, కథనం దగ్గర్నుంచి సినిమాలో అనేక విషయాలు ప్రేక్షకులకు రుచించలేదు. అయితే దసరా పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవులు, అదిరిపోయే పబ్లిసిటీ వల్ల ఈ చెత్రం ఈ వారంలో అత్యధిక కలెక్షన్లు కలిగిన చిత్రంగా నిలబడింది. అయితే ఫిలిం నగర్ మాత్రం ఈ చిత్రం యావరేజ్ నుంచి బిలో యావరేజ్ చిత్రం గా నిలబడుతుందని అంటోంది.
2. "తులసి"కి తగ్గిన కలెక్షన్లు
విక్టరీ వెంకటేష్ నటించిన "తులసి" చిత్రం కలెక్షన్లు బాగా తగ్గాయి. కుటుంబ హీరోగా పేర్గాంచిన వెంకటేశ్ ఓవర్ మాసిజం చూయించడం వల్ల మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా తగ్గారు. కుటుంబ సమేతంగా చూసే వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ఈ చిత్ర కలెక్షన్లు తగ్గాయి.
3. ఇప్పటికీ నిలకడగా వుంది "హ్యాప్పీ డేస్" ఒక్కటే
శేఖర్ కమ్ముల చిత్రం "హ్యాప్పీ డేస్" చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ నిలకడగా సాగుతున్నాయి. యువతతోబాటు కుటుంబ, మహిళా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు.
4. అలిసిపోయిన "చిరుత"
రాం చరన్ తేజ్ నటించిన "చిరుత" చిత్రం టాప్-5 పరుగు పందెంలో అలిసిపోయింది. కలెక్షన్లు తగ్గడమే కాకుండా, ఎక్కడ చూసినా సినిమా ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు.
5. అయిదవ స్థానంలో "భయ్యా"
విశాల్ నటించిన "భయ్యా" చిత్రం అయిదవ స్థానాన్ని ఆక్రమించింది. ద్విభాషా చిత్రమిన దీనికి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. "యావరేజ్ ఫిలిం" టాక్ తో చిత్రం కొనసాగుతొంది. ఒక్కసారి చూడవచ్చు అని సినీ పరిశ్రమ అభిప్రాయం.
శ్రీవెంకట్ బులెమోని
No comments:
Post a Comment