చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం వెనుక ఉన్న అజ్ఞాత హస్తం ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి జనార్ధన్ రెడ్డి కుమారుడిదేనని హైదరాబాదులో ప్రాధమిక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా వెళ్ళడించడానికి ధైర్యం చయడం లేదు. పోలీసులు కూడా ప్రాధమిక దర్యాప్తులో ఇదే విషయాన్ని చూచాయనగా తెలుసుకున్నా, ఇంతవరకు చిరంజీవి వైపు నుంచి కానీ, అతని తరుపు వారి నుంచికానీ ఎలాంటి ఫిర్యాదు లేకపోవడం వల్ల అందరూ "మనకెందుకులే" అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల వివాహం జరగగానే ఏమాత్రం ఆర్థిక పరిపుష్టి లేని శిరీష్ భరద్వాజ్ ఏకంగా పలు కార్లు మారుతూ శ్రీజతో ముందుగా గోవా వెళ్ళడం, ఆ వెంటనే అక్కడినుంచి తమ ప్రయాణాన్ని ఢిల్లీకి మార్చడం అంతా ప్రణాళికా బద్దంగా జరిగిందని పలువురి అభిప్రాయం. శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను హైదరాబాదు నుంచి పంపించేప్పుడు పి జె ఆర్ తనయుడు వీరికి లక్ష రూపాయలను ఇవ్వడమే కాకుండా, రెండు డెబిట్ కార్డులను కూడా వారికి ఇచ్చి పంపించడం జరిగిందని తెలుస్తోంది. అలాగే వీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళకన్నా ముందే వారికి అక్కడి హోటళ్ళలో బస ఏర్పాటు చేయడం, ఢిల్లీలో పెద్ద లాయర్ అయిన పింకీని ఏర్పాటు చేయడం అంతా అనుకున్నట్లే జరిపిస్తున్నారని కొందరు ఫిలిం నగర్ వాసులు అభిప్రాయపడుతున్నారు. నిజం ఆ దేవునికే తెలియాలి, కానీ ఒక్కో మలుపు సినిమాని మించిపోతోందన్నది ఫిలిం నగర్ టాక్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment