Thursday, October 25, 2007

ప్రారంభమైన బాలకృష్ణ "రంగా పాండురంగా"


కలెక్షన్ కింగ్ ,యువరత్న నందమూరి బాలకృష్ణ పాండురంగడుగా, భక్తునిగా ద్విపాత్రాభినయం చేస్తున్న "రంగా పాండురంగా" చిత్ర కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న హైదరాబాదులోని రామకృష్ణ సినీ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్ టి ఆర్ నటించిన "పాండురంగ మహత్మ్యం" చిత్రం ఆధారంగా, కొన్ని చిన్న చిన్న మార్పులతో నిర్మించస్నున్న ఈ చిత్రంలో మొత్తం పన్నెండు మంది కథానాయికలు నటించనున్నారు. అయితే హీరోయిన్ గా ప్రధాన పాత్రలలో నటించేది మాత్రం ఇద్దరే. మిగతా పది మందీ పాడురంగని పాత్రతోబాటు గోపికలుగా అతిధి పాత్రలలో నటించనున్నారు. ఈ చిత్రంలో పన్నెండు పాటలుంటాయని తెలిసింది. వీటికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. జె కె భారవి కథా నిర్వహణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత కె రాఘవేంద్ర రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని తెలిసింది. కాగా పాత "పాడురంగ మహత్మ్యం" లో భక్తునిగా ఎన్ టి ఆర్ నటించగా, భగవంతునిగా నటి విజయనిర్మల నటించింది.

No comments: