Thursday, October 18, 2007

చిరంజీవి కూతురి వివాహాన్ని ప్యూహాత్మకంగా నిర్వహించింది పి జె ఆర్ తనయుడా..?


చిరంజీవి కూతురు శ్రీజ వివాహం అత్యంత పకడ్బందీగా శిరీష్ భరద్వాజ్ తో జరగడం వెనక కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శిరీష్ భరద్వాజ్ జనార్దన్ రెడ్డి కుమారుడు మంచి మిత్రుడే కాకుండా, తల్లి తరఫున ఇరువురు బంధువులు కూడా అవుతారని తెలిసింది. తనకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులున్నాయని, తాను పెద్దమ్మ తల్లి భక్తుడినని శిరీష్ భరద్వాజ్ బుధవారం టీవీ చానెళ్ల ప్రతినిధులతో అన్నారు. పి. జనార్దన్ రెడ్డి పెద్దమ్మ తల్లి భక్తుడనే విషయం తెలిసిందే. హైదరాబాదులోని ప్రకాష్ నగరులో ఉండే సాధారణ కుటుంబానికి చెందిన శిరీష్ సాహసం చేసి చిరంజీవి కూతురును రహస్యంగా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన పి జనార్ధన్ రెడ్డి గానీ, అతని కుటుంబీకులు గానీ ఎలాంటి స్పందనా తెలియజేయడం లేదని మీడియా రిపోర్ట్. అయితే ఈ రోజు సాయంత్రం లోగా జనార్ధన్ రెడ్డి పత్రికావిలేఖరులతో మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు చిరంజీవి ఇంటి దగ్గర ఇంకా గంభీర వదనాలే దర్శణం ఇస్తున్నాయి. చిరంజీవితో మాట్లాడటంకోసం పత్రికా విలేఖరులు, ఛానెల్స్ రిపోర్టర్లు చిరంజీవి ఇంటి దగ్గరే నిరీక్షిస్తున్నారు.

1 comment:

oremuna said...

అంతే కాకుండా భరద్వాజ్ ది అనబడుతున్న ఆర్కుట్ ప్రొఫైల్ ల్లో "పీ జే ఆర్ ఫాన్స్ " కమ్యునిటీ లో సభ్యుడు :)