Monday, October 29, 2007

రాం,జెనీలియాల "రెడీ" దేనికైనా ...

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా జంటగా రూపొందుతున్న సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమాకు "రెడీ" టైటిల్ను, "దేనికైనా" అనేది టాగ్ లైన్ గా పెట్టారు. ఈ సినిమాను స్రవంతి రవికోషోర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఒక పాటను వైజాగ్ లో చిత్రీకరించనున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments: