చిరంజీవి రాజకీయ ప్రవేశం విషయంలో ఇన్నాళ్ళూ పేరుకుపోయిన నిశ్శబ్ధాన్ని అక్టోబర్ 2వ తేదీన ఛేదించదానికి రంగం సిద్దమవుతోంది. అందిన సమాచారం ప్రకారం కొంతమంది ఎన్.ఆర్.ఐ.ల సహకారం, కొన్ని స్థానిక రాజకీయ శక్తుల ప్రమేయంతో చిరంజీవి కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం దాదాపు ఖరారైంది. దానికి ముహూర్తంగా అక్టోబర్ 2వ తేదీని ఎంచుకున్నట్లు తెలిసింది.
ఆ రోజు జరగనున్న గాధీ జయంతి సందర్భంగా చిరంజీవి, కొత్త పార్టీని ప్రకటించడంతోబాటు, స్థానిక తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. అలాగే తమ పార్టీ కులాల ప్రాతిపదికలో పనిచేయదని, కులరహిత, మతరహిత సభ్య సమాజం లక్ష్యంగా తమ కొత్త పార్టీ పనిచేస్తుందని చిరంజీవి ప్రకటించడంతోబాటు, తమ రాజకీయ ప్రాతిపదికను తెలియజేయనున్నట్లు తెలిసింది. భవిష్యత్ రాజకీయ లక్ష్యాలను ఏర్పాటు చేయకన్నా ముందు కొన్ని తాత్కాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించడంకోసం చిరంజీవి యువత పనిచేయవలసిందిగా చిరంజీవి పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నెన్నో రూమర్లు ప్రచారంలో ఉండగా చిరంజీవి కదలికలను గమనిస్తున్న పాత్రికేయులు, కొన్ని వెబ్ సైట్లు మాత్రం చిరంజీవి రాజకీయ ప్రవేశం అక్టోబర్ 2తో ముడిపడి ఉందని వెళ్ళడిస్తున్నాయి. చివరికి అక్టోబర్ 2న ఏం జరుగుతుందో వేచిచూద్దాం.
No comments:
Post a Comment