నీతులు చెప్పేకన్నా ముందు వాటిని పాఠించాలని చెబుతూ హీరో విక్రం, నటి శ్రేయలు జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం "మల్లన్న" చిత్రం యూనిట్ రెండు గ్రామాలను దత్తతకు తీసుకుంది.
ఆరంభం నుంచే వార్తల్లో నిలవాలని భావిస్తున్న ఈ సినీ బృందం ఈ చిత్ర ప్రారంభాన్ని ఏకంగా "గిన్నిస్ రికార్డ్స్" లోకి ఎక్కించడం కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రపంచంలోనే తొలిసారిగా ఈ చిత్ర ట్రైలర్ తో కూడిన వెయ్యి ఎలక్ట్రానిక్ ఇన్విటేషన్ లను ప్రచురించి రికార్డులకు ఎక్కింది. గిన్నిస్ వారు దీనిని ఇంకా రికార్డు చేయనప్పటికీ, రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది."ఒక్కో ధనవంతుడు ఒక్కో వీధిని దత్తతుకు తీసుకుని అబివృద్ది పరిస్తే సమాజంలో అసమానతలు చాలావరకు తొలిగి పోతాయని చెప్పే ఇతివృత్తంతో" ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకని ఆ నీతిని చెప్పేకన్నా ముందు తామే ఈ సూత్రాన్ని పాఠించాలని చిత్ర యూనిట్ భావించింది. తదనుగుణంగా తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని "చెల్లపట్టి", "సంఘపట్టి" అనే రెండు గ్రామాలను దత్తతుకు తీసుకుంది.ఈ గ్రామాలలో రోడ్ల సౌకర్యం, అంగన్ వాడీ కేంద్రం, పాఠశాల భవనం వంటివి చిత్ర యూనిట్ నిర్మించనుంది. అలాగే ఈ గ్రామాలకు సంబంధించి భవిశ్యత్తులో కూడా కనీస అవసరాలు, ఇతర అభివృద్ది పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులను చిత్ర యూనిట్ నియమించింది. ఇలా కొత్తదారిలో వెళ్ళడం ఖర్చుతో కూడినదైనా ఇది ప్రజలకు మేలు చేసేది కనుక ఈ దారిని ఎంచుకున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
No comments:
Post a Comment