Friday, September 28, 2007

జాతీయ జెండాను కించపరచినందుకు అమీర్ ఖాన్ కు అరెస్ట్ వారెంట్




బాలీవుడ్ కథానాయకులు ఒక్కరొక్కరుగా జైలుకువెలుతున్నారు.గతంలో నటులు సంజయ్ దత్, ఆతర్వాత సల్మాన్ ఖాన్ లు జైలుకు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అమీర్ ఖాన్ వంతైంది.


ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్స్ షోరూం ఓపెనింగ్ కు అమీర్ ఖాన్ ముఖ్య అథిధిగా వచ్చారు. అప్పుడు ఆ షోరూం పైభాగంలో 11 జాతీయ జెండాలను ఎగురవేశారు. నిబంధనల ప్రకారం జాతీయ జెండాను సూర్యాస్తమయం తరువాత ఎగురవేస్తే దాన్ని జాతీయ జెండాను కించపరచబడినట్లుగా భావించి, అందుకు భాద్యులైన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమం పూర్తయినా జెండాలను నిభందనల ప్రకారం క్రిందికి దించలేదు. ఈ విషయం కార్ల షోరూం యజమానుల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో హడావిడిగా వాటిని క్రిందికిదించారు. అయితే సదరు కార్ల షోరూం యజమానులైన అశోక్, రాజేశ్ రాజ్పాల్ లు, ఆ కార్యక్రమానికి ముఖ్య అథిధిగా వచ్చిన నటుడు అమీర్ ఖాన్ లు ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఇది ఉద్దేష్యపూర్వకంగా చేసిన చర్యగా భావించి ఈ ముగ్గురిపై చర్య తీసుకోవలసిందిగా కోరుతూ స్థానిక న్యాయవాది శైలేంద్ర శర్మ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన న్యాయాధికారి ఆ ముగ్గురికి బెయిలుతో కూడిన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మలి విచారణ అక్టోబర్ 12వ తేదీన జరుగుతుంది.

No comments: