Thursday, September 20, 2007

కొంత మంచి + కొంత చెడు = పవన్ కల్యాణ్.




ఎప్పుడూ వివాదాలతో సహజీవనం చేసే టాలీవుడ్ కథానాయకుడు పవన్ కల్యాణ్ లో ఉన్న మంచిని అతని వివాదాలు తెరమరుగు చేస్తున్నాయని తెలిసింది.


ఒకప్పుడు పరిటాల రవి గొడవ, "ఖుషి" దర్శకుడు ఎస్.జె సూర్యను సెట్లో కొట్టడం, కోపాన్ని తట్టుకోలేక అన్నపూర్న స్టూడియోలో గొడవచేసి సెట్ ను కూల్చడం, చిరంజీవి కూతురు నిష్చితార్థం ఉదయకిరన్ తో జరుగుతున్నప్పుడు, డెక్కన్ క్రానికల్ రిపొర్టర్ని కొట్టడం, ప్రస్తుతం తన భార్య నందినితో కోర్టులో గొడవ ...ఇలా ఎప్పుడూ వివాదాలు చుట్టుముట్టి ఉండే పవన్ కల్యాణ్ సహజసిద్దంగా దయార్ద హృదయుడని ఫిల్మ్ నగర్ అంటోంది. ఎన్నోమార్లు జూనియర్ ఆర్టిస్టులకు ఆర్థిక సహాయం చేయడం, విద్య,ఉపాది కలిగించడం కోసం చాలా ఉత్సాహం చూయించడమే కాకుండా, కొందరు బీదవారికి వారి ఆరోగ్య రక్షణ కోసం ఎంతో ధన సహాయం చేసాడని, అలాంటి అతనికే ఎప్పుడూ ఇలా వివాదాలు చుట్టుముట్టడం తమను బాధిస్తోందని కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దేవుడు ఆయనకు మంచే చేస్తాడని అంటున్నారు. ఏ విషయానికైనా వెంటనే స్పందించే స్వభావమే పవన్ వివాదాలకు కారణమని దగ్గరివారు అంటున్నారు. ఉద్రేకాన్ని తగ్గించుకుని శాంతంగా వుంటే పవన్ చాలా ఉత్తముడని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

No comments: