కొందరికి కొన్ని అపూర్వ క్షణాలు ఉంటాయి. కొందరు కొందరికి అపురూప వ్యక్తులు అవుతారు. కొందరిపై కొందరికి పెరిగే అభిమానం ఎలాంటి సంఘటనలకైనా దారి తీస్తుంది. భారత దేశంలో తనకంటూ ప్రత్యేకమైన హోదా కలిగిన వ్యక్తి తను అభిమానించే ఒక నటి ఆటోగ్రాఫ్ కోసం సెక్యూరిటీ వారిచేత నెట్టివయబడ్డాడంటే అది సామాన్య విషయం కాదు. ఆ వ్యక్తి అభిమానాన్ని పొందిన వ్యక్తీ సామాన్యమైన వ్యక్తి అయి ఉండరు. దక్షిణ భారత దేశంలో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య నటుడైన చిరంజీవి ఒక వైపు మెగా స్టార్ గా కొనసాగుతూ, మరోవైపు ఒక నటి ఆటోగ్రాఫ్ కోసం ఏకంగా సెక్యూరిటీ వారిచేత నెట్టివేయబడ్డ సంఘటన 1989లో అమెరికాలో, ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జరిగింది.
1989లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్ళిన చిరంజీవి అక్కడ తన అభిమాన నటి గోల్డీ హాన్స్ ను చూడడం జరిగింది. తను ఎంతగానో అభిమానించే హాలీవుడ్ నటి ఆమె. ఆమెకు సంబంధించిన ఎన్నెన్నో ఫోటోలు, సినిమాల డి.వి.డిలను ఎంతో భద్రంగా దాచి ఉంచుకున్న చిరంజీవి, అక్కడ ఆమెను చూడగానే తను ఓ మెగా స్టార్ ను అనే విషయమే మరచిపోయి ఒక సాధారణ ప్రేక్షకునిగా అందరితో కూడి గోల్డీ హాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డాడు. అప్పుడు ఆమెకు సెక్యూరిటీగాఉన్న గార్డులు చిరంజీవితో సహా, అందరినీ వెనక్కి నెట్టివేశారు. అయినా వెరవకుండా, ఆమెదగ్గరికివెళ్ళి, ఆమె ఆటోగ్రాఫ్ తీసుకున్న చిరంజీవి జీవితంలో ఏదో దొరకనిది పొందిన అనుభూతికి లోనయ్యానని ఆయనే స్వయంగా అక్కడ తనకు తెలిసినవారితో చెప్పడం, ఆ తర్వాత ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా ఇక్కడి పాత్రికేయులకు చెప్పడం జరిగింది. చిరంజీవి జీవితంలో తీసుకున్న తొలి, చివరి ఆటోగ్రాఫ్ అది.
1 comment:
Those are all memorable emotions.
Post a Comment