తెలుగు సినిమాల బడ్జెట్ చుక్కలను తాకుతోంది. తాకుతోంది సినీ బడ్జెట్ అనేకన్నా.. తెలుగు సినీ కథానాయకుల బడ్జెట్ అంటే సమంజసంగా ఉంటుందని పలువురు నిర్మాతలు విమర్షిస్తున్నారు.
నిజానికి సినిమాల బడ్జెట్ ఒక విధంగా అందుబాటులోనే ఉంటుంది, కానీ అందుబాటులో లేనిది సినీ కథానాయకుల బడ్జెటేనని టాలీవుడ్ అంటోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అక్షరాలాఎనిమిది కోట్ల యాభై లక్షలను తన రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. తను నటించే చిత్ర నిర్మాతనుంచి చిరంజీవి రెమ్యునరేషన్ కు బదులుగా నైజాం ఏరియా హక్కూలను తీసుకుని, వాటిని వేరేవారికి అమ్ముకోవడం ఆయన చేస్తున్న పని. గత శంకర్ దాదా జిందాబాద్ చిత్రాన్ని ఆయన ఎనిమిది కోట్ల యాభై లక్షలకు అమ్ముకున్నారు. అంటే ఆయన రెమ్యునరేషన్ ఎనిమిది కోట్ల యాభై లక్షలన్నమాట. ఇక ఆయన తర్వాత ఇప్పుడు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు మహేశ్ బాబు, జూనియర్ ఎన్.టి.ఆర్.లే. వారు సుమారుగా ఆరు కోట్ల రూపాయలను తమ రెమ్యునరేషన్ గా కోరుతున్నారు. ఇటీవల మహేశ్ బాబు చిత్రాలు బాగా విజయవంతం కావడం, ఇక ఎన్ టి ఆర్ మార్కెట్ రేంజ్ పెరగడం తో వారు అధికంగా ఆషిస్తున్నారు. ఇక వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ,పవన్ కళ్యాన్ లు సుమారు 4.5 నుంచి 5 కోట్ల రూపాయలను ఆషిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన వారి రెమ్యునరేషన్ ఎక్కువ లేకున్నా, వారి చిత్రాల మార్కెట్ తీరును దృష్టిలో వుంచుకుంటే మాత్రం వారు కూడా ఎక్కువగానే ఆషిస్తున్నారని తెలిసింది. దాంతో పలువురు చిత్ర నిర్మాతలు పెరిగింది సినిమాల బడ్జెట్ కాదు కథానాయకుల బడ్జెట్ అని చమత్కరిస్తున్నారు.
No comments:
Post a Comment