Monday, September 17, 2007

అతీంద్రియ శక్తులు పొందిన కుక్క కథతో అమెరికన్లను అలరిస్తున్న "అండర్ డాగ్" చిత్రం.


ఆకాశంలో రివ్వున ఎగురుతూ, ఆపదలలో ఉన్న వారిని రక్షిస్తూ, తన అతీంద్రియ శక్తులతో దుర్మార్గుల పాలిట సిం హస్వప్నంగా మారిన కుక్క కథ తో నిర్మించిన "అండర్ డాగ్" చిత్రం హాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత నెలలో అమెరికాలో విడుదలైన ఈ సెమీ యానిమేషన్ చిత్రం బాలలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోగా నటించిన కుక్క పేరు "షూ షైన్". ఇది అన్ని కుక్కల్లాగే సాధారణమైనదే. అయితే ఈ సినిమాలోని విలన్ మానవాళిని నాశనం చేయడం కోసం చేస్తున్న ప్రయోగాలలో ఉత్పన్నమైన ఒక ద్రావకం అనుకోకుండా, ఈ కుక్క చేతికి దొరకడంతో కథ మలుపుతిరుగుతుంది. ఈ ద్రవ ప్రభావం వల్ల ఈ కుక్కకు అతీంద్రియ శక్తులు వచ్చి ఇది మనుషుల్లాగే మాట్లాడడం, ఆలోచించడంతోబాటు,గాలిలో ఎగరడం, జరగబోయేదాన్ని పసి గట్టడం చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అమెరికన్లను ఆకర్శిస్తోంది. సూపర్ డాగ్ లా మారి చిన్నారులతోబాటు, పెద్దలనూ ఆకట్టుకుంటున్న ఈ చిత్రం భారత్ లో విడుదల కావడానికి ఇంకా కొంత సమయం పట్టేలావుంది. అమెరికన్ మార్కెట్ మాత్రం ఇటీవల విడుదలైన మంచి కామిక్ చిత్రంగా దీనిని ఆదరిస్తోంది.

1 comment:

Burri said...

మీ టపాలు చాలా చాలా బాగున్నాయి. చాలా రోజుల తరువాత మాకు ఒక సితార, ఒక శివరంజని చదివినట్లు ఉన్నది.
-మరమరాలు