Tuesday, September 18, 2007

"అడవిదొంగ","క్రిష్" ల వాసనల్తో రోమాంటిక్ లవ్ & యాక్షన్ స్టోరీతో రూపుదిద్దుకున్న "చిరుత".




టాలీవుడ్ అంచనాలకు అందకుండా రూపొందించాలనే ప్రయత్నంలో భారీ అంచనాలకు తెరలేపిన చిత్రం "చిరుత". చిరంజీవి తనయుని ప్రధమ చిత్రం కావడం, పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించడం.. ఇలా అన్నింట్లా భారీతనం ఉట్టిపడుతున్న ఈ చిత్రం యువతే ప్రధాన లక్ష్యంగా నిర్మించిన రోమాంటిక్ లవ్ మరియు యాక్షన్ కథతో రూపుదిద్దుకుంది.


కథాపరంగా పెద్ద భూస్వామి కుమారుడైన చరన్ , చిన్న తనంలోనే దగ్గరివారు చేసిన కుట్రకు బలై తన తల్లిదండృలను కోల్పోవడంతో సినిమా ప్రారంభమౌతుంది. ఆ తర్వాత అడవిలో పెరిగిన చరన్ అక్కడి చిరుతపులితో స్నేహం చేయడం, మొరటుగా పెరిగిన చరన్ అడవి జంతువులలాగా ఎంతదూరమైనా చెట్లపైనుంచి, కొండలపైనుంచి ప్రాకుతూ వెళ్ళడంతోబాటు, మహా బలషాలిగా రూపాంతరం చెందుతాడు. తదితరం జరిగిన కథలో అతని బంధువులు అతని దగ్గరున్న చైన్ మరియు పుట్టుమచ్చలద్వారా అతడిని గుర్తించి, తమకు జరిగిన అన్యాయాన్ని తెలపడం, తమకు అన్యాయం చేసిన వారిపై చరన్ సాక్షాలు దొరకని రీతిలో పోరాడి విజయం సాధించడం ప్రధాన కథాం షంగా, పూర్తి స్థాయి రోమాంటిక్ లూక్స్ తో, డిఫరెంట్ ఫైట్ కంపోజింగ్ లతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. చిరంజీవి నటించిన "అడవిదొంగ" మరియు హృతిక్ రోషన్ నటించిన "క్రిష్" ల వాసనలు బలంగా వీచే "చిరుత"విజయమే లక్ష్యంగా భారీతనాన్ని సముపార్జించుకుని రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల తీర్పుకోసం ఈ నెల 28వ తేదీన పెద్దౌఎత్తున విడుదలకాబోతోంది.

No comments: