Wednesday, September 5, 2007

చిరంజీవి దర్శకత్వం వహించనున్న చిత్రానికి పనిచేస్తున్న ముగ్గురు తమిళ రచయితలు.


చిరంజీవి దర్శకత్వం వహించడం దాదాపు ఖాయమైనట్లే. చిరంజీవి రాజకీయ జీవితంపై కూడా ఊహగానాలు చెలరేగుతున్న ఈ తరుణంలో చిరంజీవి దర్శకత్వం వహించకపోవచ్చునని ఇంతదాకా అనుకున్నా, చివరికి దర్శకత్వం వహించడం దాదాపు ఖాయమైంది. ఇందుకు సాక్ష్యంగా చిరంజీవి ముగ్గురు తమళ రచయితలతో తను దర్శకత్వం వహించే చిత్రానికి కథా రచన రూపొందిస్తున్నారు.

ప్రముఖ తమిళ రచయితలు భూపతి, క్రిష్ణ స్వామి, వల్లసురై లు గత కొన్ని రోజులుగా ఈ కథా చర్చలు చేస్తూ చాలా దీక్షతో కథారచన కొనసాగించడం, ఎప్పుడూ చెన్నై టు హైదరాబాద్ లేక హైదరాబాద్ టు చెన్నై అంటూ చిరంజీవి ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఈ విశయాన్ని తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా చిరంజీవి రాజకీయ నేపద్యం బలపడుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ముగ్గురు రచయితలు వ్రాస్తున్న కథ కూడా ప్రజా జీవితానికి చెందినదే కావడం వల్ల దీనిని తెలుగు రచయితలు వ్రాస్తే అది వెంటనే తెలిసి రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం ఉండడంవల్ల చిరంజీవి తమిళ రచయితలను ఎన్నుకున్నట్లు తెలిసింది. ఏదేమైనా చిరంజీవి దర్శకత్వ నేపద్యం, రాజకీయ నేపద్యం రెండూ ఏక కాలంలో బలపడుతుండడం చెప్పుకోదగ్గ మార్పుగానే కనిపిస్తోంది. అందుకే టాలీవుడ్ లో ఎప్పుడూ బహిరంగంగా రహస్య చర్చలు కొనసాగుతున్నాయి.

No comments: